Thursday, March 19, 2026
HomeTrending Newsఖట్టర్ ను కలుసుకున్న జగన్

ఖట్టర్ ను కలుసుకున్న జగన్

AP-Haryana: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు విశాఖపట్నంలో హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను  మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.  మనోహర్ లాల్ ఖట్టర్ వ్యక్తిగత పర్యటన నిమిత్తం శనివారం విశాఖ వచ్చిన సంగతి విదితమే. నగరంలోని నేచురోపతి పెమా వెల్నెస్ సెంటర్ లో చికిత్స తీసుకుంటున్నారు. ఆదివారం శారాదాపీఠం, సింహాచలం, టీటీడీ వెంకటేశ్వరస్వామి దేవాలయాలను అయన సందర్శించారు. అయన మరో మూడు రోజులపాటు వెల్నెస్ సెంటర్ లోనే ఉండే అవకాశం ఉంది.

వారం రోజులపాటు రాష్ట్రంలో ఉంటున్న ఖట్టర్ తో సమావేశమైన జగన్ అయన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఇద్దరూ కాసేపు ముచ్చటించుకున్నారు. అనంతరం సిఎం జగన్ తిరిగి తాడేపల్లి  బయల్దేరి వెళ్ళారు. అంతకుముందు విశాఖ విమానాశ్రయంలో సిఎం జగన్ కు మంత్రులు, పార్టీ ప్రజా ప్రతినిధులు, అధికారులు స్వాగతం పలికారు.

సిఎం వెంట మంత్రులు బూడి ముత్యాల నాయుడు, గుడివాడ అమర్నాథ్, మాజీ మంత్రి అవంతి కూడా ఖట్టర్  ను కలుసుకున్నవారిలో ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular