Thursday, March 19, 2026
HomeTrending Newsతులసీరావుకు సిఎం జగన్ నివాళి

తులసీరావుకు సిఎం జగన్ నివాళి

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖపట్నంలో పర్యటించారు. నిన్న రాత్రి మృతి చెందిన  విశాఖ డెయిరీ ఛైర్మన్ అడారి తులసీరావు భౌతికకాయానికి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

 

డిప్యూటీ సిఎం బూడి ముత్యాల నాయుడు, మంత్రి అమర్నాథ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టిటిడి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తదితరులు కూడా సిఎంతో పాటు తులసీరావుకు నివాళులర్పించిన వారిలో ఉన్నారు.  ధైర్యంగా ఉండాలని, తాను అండగా ఉంటానని తులసిరావు కుటుంబ సభ్యులకు సిఎం జగన్ భరోసా ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular