Johar Jagjeevan Ram: మాజీ ఉప ప్రధానమంత్రి, స్వతంత్ర సమరయోధుడ బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో బాబూ జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూల మాల వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా దేశానికి ఆయన చేసిన సేవలను ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. సిఎం తో పాటు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ విప్ కోరుముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్, ప్రభుత్వ సామాజిక న్యాయ సలహాదారు జూపూడి ప్రభాకర్ తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు.
“స్వతంత్ర సమర యోధుడు, జనం కోసమే తన జీవితాన్ని అంకితం చేసిన నాయకుడు బాబు జగ్జీవన్ రామ్ గారు. సుదీర్ఘకాలం పార్లమెంటేరియన్‌గా, ఉప ప్రధానిగా ఆయన దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయం. నేడు ఆయన జయంతి సందర్భంగా నివాళులు” అంటూ ట్విట్టర్ లో జగన్ పేర్కొన్నారు.