Saturday, November 23, 2024
HomeTrending Newsప్రతి ఏటా ఆడుదాం ఆంధ్ర: సిఎం జగన్

ప్రతి ఏటా ఆడుదాం ఆంధ్ర: సిఎం జగన్

మట్టిలోని మాణిక్యాలను గుర్తించగలిగితే, సానపట్టగలిగితే, సరైన శిక్షణ ఇవ్వగలిగితే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఇంకా ఎక్కువగా మన రాష్ట్ర పిల్లలను అత్యుత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దవచ్చని, దీనిలో భాగంగానే ఆడుదాం ఆంధ్రా కార్యక్రమాన్ని చేపట్టామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. విశాఖపట్నంలోని డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన ఆడుదాం ఆంధ్ర ముగింపు వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న సిఎం జగన్ క్రీడాకారులకు బహుమతులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా సిఎం జగన్ మాట్లాడిన ముఖ్యాంశాలు

* ఆడుదాం ఆంధ్ర.. ఆరోగ్యం, వ్యాయామం పట్ల అవగాహన పెరగడం చాలా అవసరం అనేది దీని ఉద్దేశం.
* క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, బ్మాడ్మింటన్ ఇటువంటి 5 రకాల క్రీడల్లో గత 47 రోజులుగా గ్రామ స్థాయి నుంచి ప్రోత్సహించే కార్యక్రమం చేస్తున్నాం.
* 25.40 లక్షల మంది క్రీడాకారులు గ్రామ స్థాయి నుంచి పాల్గొన్నారు. 3.30 లక్షల పోటీలు గ్రామ, వార్డు స్థాయిలో జరిగాయి.
* 1.24 లక్షల పోటీలు మండల స్థాయిలో, 7346 పోటీలు నియోజకవర్గ స్థాయిలో, 1731 పోటీలు జిల్లా స్థాయిలో, 260 మ్యాచ్‌లు రాష్ట్ర స్థాయిలో నిర్వహించాం.
* ఈరోజు ఫైనల్స్ ముగించుకొని ఈ విశాఖలో, ఈ ఉత్తరాంధ్రలో మన కోడి రామమూర్తిగారి గడ్డమీద సగర్వంగా ముగింపు సమావేశాలు నిర్వహిస్తున్నాం.
* దాదాపు 37 కోట్ల కిట్లు గ్రామ స్థాయి నుంచి పోటీ పడుతున్న పిల్లలందరికీ కిట్లు ఇచ్చాం.

* 12.21 కోట్ల బహుమతులు ఈరోజు పోటీలో పాలుపంచుకున్న మన పిల్లలందరికీ ఇవ్వడం జరుగుతోంది.
* ఈ కార్యక్రమంలో చెన్నై సూపర్ కింగ్స్, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, వీరితోపాటు మిగతా ఆటలకు సంబంధించిన ప్రో కబడ్డీ, బ్లాక్ హాక్స్, వాలీబాల్, ఏపీ ఖోఖో అసోసియేషన్, ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వారంతా పాల్గొంటూ ట్యాలెంట్‌ కలిగిన 14 మందిని వాళ్లు దత్తత తీసుకొని మరింత ట్రైనింగ్ ఇచ్చే దిశగా అడుగులు పడుతున్నాయి.
* క్రికెట్ నుంచి ఇద్దరు పిల్లలకు, ఇద్దరు చెల్లెమ్మలకు నలుగురిని గుర్తించాం.
* కబడ్డీ నుంచి ముగ్గురు మగపిల్లలు, ఒక చెల్లెమ్మను గుర్తించాం.
* వాలీబాల్ నుంచి ఒక మగపిల్లాడు, ఒక చెల్లెమ్మ, ఖోఖో నుంచి ఒక తమ్ముడు, చెల్లెమ్మను గుర్తించాం.
* బ్యాడ్మింటన్ నుంచి కూడా ఒక తమ్ముడు, చెల్లెమ్మను గుర్తించాం.
* వీళ్లకు ఇంకా సరైన ట్రైనింగ్ ఇవ్వగలిగితే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆడే పరిస్థితి ఉంటుందని మరింత ట్రైనింగ్ ఇచ్చేలా అడుగులు వేయగలిగాం.


* ఈరోజు మనం చేసిన అడుగు ప్రతి సంవత్సరం జరుగుతుంది.
* మన పిల్లల్ని ఐడెంటిఫై చేసిమరింత తర్ఫీదు ఇచ్చి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పరిచయం చేస్తాం.
* సచివాలయ పరిధి నుంచి క్రీడలను ప్రోత్సహిస్తూ, వ్యాయామానికి సంబంధించిన వ్యాల్యూను, ఆరోగ్యానికి సంబంధించిన అంశాలను మరింతగా ముందుకు తీసుకెళ్తూ ప్రోత్సహించే కార్యక్రమం.
* వీటివల్ల మరింత ప్రోత్సాహం ఆటలకు జరగాలి. మన పిల్లలకు మరింత మంచి జరగాలని మనసారా కోరుకుంటూ పిల్లలకు బహుమతులు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్