ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొని జాతీయ పతాకం ఆవిష్కరించారు. తెలుగుతల్లి, శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పోలీసు దళాల గౌరవ వందనం స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపి, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములుకు సిఎం జగన్ నమస్కరిస్తున్న డ్రాయింగ్ చిత్రపటాన్ని మంత్రి రోజా సిఎం జగన్ కు బహూకరించారు.
“మన సంస్కృతిని- మన కీర్తిని, మన పూర్వీకుల పోరాటాలను- విజయాలను, ఈ నేల పై జన్మించిన ఎందరో మహానుభావుల త్యాగాలను ఘనంగా స్మరించుకునే పండుగ రోజు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ.. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పునరంకితమవుదాం” అంటూ సిఎం జగన్ సామాజిక మాధ్యమాల్లో సందేశం ఇచ్చారు.