జాతీయ భద్రత మరియు మాదక ద్రవ్యాల అక్రమ రవాణా పై బెంగుళూరు సదస్సులో తీసుకున్న నిర్ణయాలపై ప్రభుత్వ పరంగా తగిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. బెంగుళూరులో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా నేతృత్వంలో జాతీయ భద్రత, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై దక్షిణ భారత ప్రాంతీయ సదస్సు జరిగింది. సిఎం జగన్ సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సదస్సులో పాల్గొన్నారు.
అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున , అందులోనూ నేడు ద్రవ్యవినిమయబిల్లును ఆమోదించాల్సిన నేపధ్యంలో ఈ సమావేశానికి హాజరుకాలేకపోయానని సిఎం చెప్పారు. అందుకే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతున్నానని, తమ ప్రభుత్వం తరపున డీజీపీ ఈ సదస్సుకు హాజరయ్యారని జగన్ వెల్లడించారు.