ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాసేపు సరదాగా క్రికెట్ ఆడారు. వైయస్‌ఆర్ కడప జిల్లాలో రెండోరోజు పర్యటనలో భాగంగా కడప నగరంలో సుమారు రూ.400 కోట్ల అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా కడపలో నిర్మించిన వైఎస్ రాజా రెడ్డి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ స్టేడియం అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఫ్లడ్ లైట్ల ఏర్పాటుకు శంఖుస్థాపన చేశారు. స్టేడియం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వైఎస్ రాజారెడ్డి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంలో పలువురు నాయకులు, క్రీడాకారుల కోరికమేరకు కాసేపు బ్యాటింగ్ చేశారు.
అనంతరం జరిగిన సభలో జగన్ మాట్లాడుతూ రోడ్డు మార్గంలో కడప వస్తుంటే, ఇక్కడ జరిగిన అభివృద్ధి పనులు చూసి మనసుకు ఎంతో అహ్లాదకరకంగా అనిపించిందన్నారు. గతంలో తన తండ్రి వైఎస్ హయాంలో 2004-09 మధ్య కడపలో ఇలాంటి అభివృద్ధి జరిగిందని, అయన చనిపోయిన తరువాత కడపను, ఈ జిల్లాను పాలకులు పట్టించుకోలేదని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదివరకు చేపట్టిన పనుల్లో
- నగరంలో మహావీర్ సర్కిల్ నుంచి పుట్లంపల్లి వరకు 100 అడుగుల వెడల్పుతో ఆరు వరుసల రోడ్లు
- మహావీర్ సర్కిల్ నుంచి రైల్వే స్టేషన్ వరకు ఎనబై అడుగుల వెడల్పుతో ఫోర్ లైన్ రోడ్లు నిర్మించామని
ఈ రోజు శంఖుస్థాపన చేసినచేసిన పనులు
- ఈరోజు కృష్ణాథియేటర్ నుంచి దేవుడి కడప వరకు రూ.101 కోట్లతో ఫోర్ లైన్ల రోడ్లు
- అన్నమయ్య సర్కిల్ నుంచి గోకుల్ లాడ్జ్ వరకు రూ.74 కోట్లతో రోడ్ల విస్తరణ
- అంబేద్కర్ సర్కిల్ నుంచి వై జంక్షన్ రోడ్డు వరకు రూ.62 కోట్లతో రోడ్లు విస్తరణ
- ఇండస్ట్రియల్ ఎస్టేట్ నుంచి పుట్లంపల్లి వరకు రహదారి విస్తరణ
- తెలుగుభాష అభివృద్ధికి విశేష కృషి చేసిన ప్రఖ్యాత సిపి బ్రౌన్ స్మారకార్థం గ్రంథాలయ ఆవరణలో రూ.5.5 కోట్ల వ్యయంతో నిర్మించే నూతన భవనం
- పనులకు
గతంలో ప్రారంభించిన పనుల పురోగతికి సంబంధించిన విషయాలకు వస్తే..
- రూ.125 కోట్లతో డాక్టర్ వైయస్‌ఆర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు
- మరో రూ. 40.82 కోట్లతో డాక్టర్ వైయస్‌ఆర్ సైకియాట్రిక్ ఆసుపత్రి పనులు
- మరో రూ.107 కోట్లతో డాక్టర్ వైయస్‌ఆర్ క్యాన్సర్ కేర్ సెంటర్ ఏర్పాటు
- రాజీవ్‌మార్గ్ అభివృద్దికి సంబంధించి సుమారు రూ.4 కోట్లతో చేపట్టిన పనులు
- రూ.55 కోట్లతో చేపట్టిన దేవుడి కడప సరస్సు అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని జగన్ వివరించారు.