Sunday, January 19, 2025
HomeTrending NewsYS Jagan: విల్లు ఎక్కుపెట్టిన జగన్

YS Jagan: విల్లు ఎక్కుపెట్టిన జగన్

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విల్లు ఎక్కుపెట్టారు. హాకీ స్టిక్ తో కాసేపు బాల్ తో ఓ ఆటాడుకున్నారు. క్రీడలపై తనకున్న మక్కువను ప్రదర్శించారు. వైఎస్సార్ కడప జిల్లాలో మూడు రోజుల పర్యటనలో భాగంగా నేడు పులివెందుల లో డా.వైయస్ఆర్ స్పోర్ట్స్ అకాడమీని సిఎం జగన్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా  ఆర్చరీ బ్లాక్ లో క్రీడాకారులతో ముచ్చటించి అనంతరం విల్లు చేతబూని లక్ష్యానికి గురి పెట్టారు.  అదే ప్రాంగణంలో ఉన్న హాకీ స్టేడియాన్ని పరిశీలించి స్టిక్ చేతబట్టి కాసేపు ఆడారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ సిఎం అంజాద్ పాషా, మంత్రి ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్