Saturday, November 23, 2024
HomeTrending NewsYS Jagan: ఢిల్లీలో సిఎం-కేంద్ర ఆర్ధిక మంత్రితో భేటీ

YS Jagan: ఢిల్లీలో సిఎం-కేంద్ర ఆర్ధిక మంత్రితో భేటీ

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడురోజుల పర్యటనకు ఢిల్లీ చేరుకున్నారు. ఈ సాయంత్రం  కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ తో సిఎం భేటీ అయ్యారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం 2014-15 రెవిన్యూ లోటు కు సంబంధించిన నిధులను విడుదల చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. దాదాపు 40 నిమిషాలసేపు సాగిన ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై  ముఖ్యమంత్రి చర్చించారు.

  • 2014-15కి సంబంధించిన వనరుల గ్యాప్ ఫండింగ్, 2016-2019 మధ్య కాలంలో జరిగిన పరిమితికి మించి రుణాలు కారణంగా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న పర్యవసానాలు, 2021-22లో రుణాల పరిమితిపై సడలింపులు
  • రాష్ట్రాన్ని విభజించిన తర్వాత తెలంగాణ డిస్కంలకు ఏపీ జెన్‌కో సరఫరాచేసిన విద్యుత్‌, రూ.6,756.92కోట్ల బకాయిలు
  • ఏపీ జెన్‌కో ఇప్పటికే తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఈ నిధులు త్వరగా విడుదల చేయాల్సిన ఆవశ్యకత
  • రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టే కేపిటల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మీద కేంద్ర ప్రభుత్వం స్పెషల్‌ అసిస్టెన్స్‌ ఇచ్చేలా బడ్జెట్‌లో పొందుపరిచిన దృష్ట్యా, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విద్యా వైద్య రంగాల్లో చేపట్టిన విప్లవాత్మక చర్యలు చేపట్టిందని, స్కూళ్లలో నాడు – నేడు కింద చేసిన రూ.6వేల కోట్లు ఖర్చు
  • అలాగే ఆరోగ్య రంగంలో కూడా నాడు -నేడు కింద చేపట్టిన చర్యలు, దీనికోసం వెచ్చించిన  రూ.4వేల కోట్ల నిధులు… లాంటి అంశాలను  కేంద్ర ఆర్ధిక మంత్రితో సిఎం జగన్ ప్రస్తావించారు.

రాష్ట్ర ప్రభవిష్యత్తును ఈ కార్యక్రమాలు తీర్చిదిద్దుతాయని, వీటికోసం చేసిన ఖర్చును క్యాపిటల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌గా భావించి స్పెషల్‌ అసిస్టెన్స్‌ను వర్తింపు చేయాల్సిందిగా కోరారు.

రేపు ప్రధాని అధ్యక్షతన జరిగే నీతిఆయోగ్ 8వ పాలక మండలి సమావేశంలో జగన్ పాల్గొంటారు. ఎల్లుండి జరిగే పార్లమెంట్  నూతన భవన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి జగన్ హాజరు కానున్నారు. అదేరోజు సాయంత్రం బయల్దేరి తాడేపల్లికి రానున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్