రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ పర్యటన ముగించుకుని తిరిగివచ్చారు. ఈ ఉదయం ఏడు గంటల ప్రాంతంలో గన్నవరం విమానాశ్రయం చేరుకున్న సిఎంకు డిప్యూటీ సిఎం బూడి ముత్యాల నాయుడు, మంత్రులు పినిపే విశ్వరూప్, జోగి రమేష్ కారుమూరి నాగేశ్వర రావు, ఎంపిలు వల్లభనేని బాలశౌరి, నందిగం సురేష్, ఎమ్మెల్యేలు కొలుసు పార్థసారథి, వల్లభనేని వంశీ, వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, కైలె అనిల్ కుమార్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, చీఫ్ సెక్రటరీ డా. కెఎస్ జవహర్ రెడ్డి, డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి, సిఎంవో అధికారులు స్వాగతం పలికారు. అనంతరం తాడేపల్లి నివాసానికి బయలుదేరి వెళ్ళారు.