Friday, March 13, 2026
HomeTrending Newsబొగ్గు కొనుగోలుకు నిధుల కొరత లేదు: సిఎం

బొగ్గు కొనుగోలుకు నిధుల కొరత లేదు: సిఎం

థర్మల్‌ విద్యుదుత్పత్తి కేంద్రాలను పూర్తిస్థాయి సామర్థ్యంతో నడిపించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో కరెంటు పరిస్థితులపై తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో అధికారులతో సీఎం సమీక్షించారు. రాష్ట్రంలోని వివిధ థర్మల్‌కేంద్రాల నుంచి కరెంటు ఉత్పత్తి, బొగ్గు నిల్వలపై అధికారులను అడిగి తెలుగుకున్నారు.

దేశంలో బొగ్గు నిల్వలు ఎక్కడ ఉన్నా వాటిని తెప్పించుకోవడానికి అన్నిరకాలుగా చర్యలు తీసుకోవాలని సిఎం సూచించారు. కావాల్సిన బొగ్గు కొనుగోలు చేయాలని, ఎలాంటి నిధుల కొరత లేదని స్పష్టం చేశారు.  ఇప్పుడున్న థర్మల్ కేంద్రాల్లో ఉత్పత్తిని ప్లాంట్ల సామర్థ్యం మేరకు పెంచాలని సిఎం సూచించారు. కృష్ణపట్నం,  వీటీపీఎస్‌ కేంద్రాల్లో ఉన్న కొత్త యూనిట్లలో వెంటనే ఉత్పత్తి ప్రారంభించాలని, తద్వారా 1600 మెగావాట్ల విద్యుత్‌ను అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సింగరేణితో కూడా సమన్వయం చేసుకుని అవసరాలమేరకు బొగ్గును తెప్పించుకోవాలన్నారు.

కేంద్ర ప్రభుత్వంలోని సంబంధిత మంత్రిత్వశాఖలు, ఏజెన్సీలతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని, కరెంటు కోతలు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి నిర్దేశించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular