Saturday, March 14, 2026
HomeTrending Newsటిడ్కో ఇళ్ళ నిర్వహణపై ప్రత్యేక దృష్టి: సిఎం

టిడ్కో ఇళ్ళ నిర్వహణపై ప్రత్యేక దృష్టి: సిఎం

డిసెంబర్ నాటికి లక్షా పదివేల మంది లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లు అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే 40,576 ఇళ్లు అందజేశామని అధికారులు వెల్లడించారు. డిసెంబర్‌ లో 1,10,672 ఇళ్లతో పాటు వచ్చే మార్చికల్లా మరో 1,10,968 ఇళ్లు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.  ఫేజ్‌–1కు సంబంధించి  రిజిస్ట్రేషన్ల ప్రక్రియ దాదాపుగా ముగిసిందన్నారు. గృహనిర్మాణశాఖపై క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్  రెడ్డి సమీక్ష నిర్వహించారు.

టిడ్కో ఇళ్ల నిర్వహణపై ప్రత్యేక చర్యలు తీసుకున్నామని , వేయి ఇళ్లకు పైగా ఉన్న చోట్ల రెసిడెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఏర్పాటు చేసి ఇళ్ల నిర్వహణపై వారికి అవగాహన, మార్గదర్శకాలు సూచిస్తున్నామని అధికారులు సిఎంకు వివరించారు.

టిడ్కో ఇళ్లు నిర్వహణ బాగుండాలని,  వాటిని పట్టించుకోకపోతే మళ్లీ మురికి వాడలుగా మారే ప్రమాదం ఉంటుందని సిఎం అభిప్రాయపడ్డారు.  ఏ రకంగా ఆ ఇళ్లను నిర్వహించుకోవాలన్నదానిపై అసోసియేషన్లకు బాసటగా నిలవాలని సూచించారు.

గృహనిర్మాణంలో పురోగతిని  వివరిస్తూ…  వర్షాలు తగ్గినందున వేగంగా పనులు ముందుకు సాగుతాయని,  ఈ ఒక్క 2022–23 ఆర్థిక సంవత్సరంలో గృహనిర్మాణం కోసం రూ.5,005 కోట్లు ఖర్చు చేస్తున్నామని వివరించారు.  విశాఖలో మంజూరుచేసిన ఇళ్ల నిర్మాణాలపైనా ప్రత్యేక దృష్టిపెడుతున్నామని, కాలనీల్లో మౌలిక సదుపాయాలు, విద్యుద్దీకరణ పనులు కూడా సమాంతరంగా కొనసాగుతున్నాయని తెలియజేశారు.

ఈ సమీక్షా సమావేశంలో గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్, పురపాలక పట్టణాభివృద్ధిశాఖమంత్రి ఆదిమూలపు సురేష్,  ఏపీఎస్‌హెచ్‌సీఎల్‌ ఛైర్మన్‌ దవులూరి దొరబాబు, ఏపీ టిడ్కో ఛైర్మన్‌ జమ్మాన ప్రసన్నకుమార్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్‌ వై శ్రీలక్ష్మి, ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ చీఫ్‌ కమిషనర్‌ జి సాయి ప్రసాద్, గృహనిర్మాణశాఖ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌ జైన్, ఆర్ధికశాఖ కార్యదర్శి కె వి వి సత్యనారాయణ, సీసీఎల్‌ఏ సెక్రటరీ ఏ.ఎండీ. ఇంతియాజ్, గృహనిర్మాణశాఖ ప్రత్యేక కార్యదర్శి రాహుల్‌ పాండే, ఏపీ హౌసింగ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఎండీ డాక్టర్‌ లక్ష్మీషా, టిడ్కో ఎండీ సీహెచ్‌ శ్రీధర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Also Read : హాస్టళ్ళ నిర్వహణకు ప్రత్యేక అధికారులు: సిఎం 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular