మద్యం అక్రమ రవాణాపైన, అక్రమం మద్యం తయారీపైన ఉక్కుపాదం మోపాలని, అలాగే నిర్దేశించిన రేట్లకన్నా ఇసుకను ఎక్కువ ధరకు అమ్మితే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దీనిపై ఇటీవల చేసిన చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. మద్య నియంత్రణ, స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (ఎస్.ఈ.బీ.) పై క్యాంప్ కార్యాలయంలో సిఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం పలు సూచనలు చేశారు
మద్య నియంత్రణపై….
⦿ మద్య నియంత్రణలో భాగంగా రేట్లను పెంచాం
⦿ మూడింట ఒక వంతు దుకాణాలు, బెల్టుషాపులు పర్మిట్ రూమ్‌లను మూసివేయించాం
⦿ లిక్కర్‌సేల్స్ నెలకు 34 లక్షల కేస్ ల నుంచి 21 లక్షలకు తగ్గాయి
⦿ బీరు సేల్స్ నెలకు 17 లక్షల కేస్ ల నుంచి 7 లక్షలకు తగ్గాయి
ఇసుక లభ్యత
⦿ అధిక రేట్లకు ఎవరైనా అమ్మితే వెంటనే వినియోగదారులు ఎస్‌ఈబీ కాల్‌సెంటర్ సమాచారం అందించేలా ప్రచారం చేయాలి
⦿ వచ్చే ఫోన్ కాల్స్ పై సత్వరమే స్పందించి అధికారులు చర్యలు తీసుకోవాలి
⦿ సంబంధిత జిల్లాల వారీగా ఈ ప్రచారం చేయాలి: సీఎం
⦿ ఆ జిల్లాల్లో రేట్ల వివరాలను తెలియజేస్తూ అడ్వర్టైజ్‌మెంట్ ఇవ్వాలి:
⦿ అంతకన్నా ఎక్కువ ధరకు ఎవరైనా విక్రయిస్తే.. తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి:
⦿ వర్షాలు తగ్గుముఖం పట్టగానే ఇసుక రవాణాకోసం మరిన్ని రీచ్‌లు, డిపోల సంఖ్య పెంచాలి
గంజాయి సాగు, రవాణాపై ఉక్కుపాదం
⦿ గంజయి సాగు, రవాణాను అరికట్టాలి, క్రమం తప్పకుండా దాడులు నిర్వహించాలి
⦿ పోలీసు విభాగాలు సమన్వయంతో పనిచేయాలి
⦿ డ్రగ్స్‌కు వ్యతిరేకంగా విశ్వవిద్యాలయాలు, కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి
⦿ ఏ కాలేజీలోనైనా అలాంటి ఉదంతాలు కనిపిస్తే.. అక్కడ ప్రత్యేక దృష్టిపెట్టాలి
⦿ క్రమం తప్పకుండా విశ్వవిద్యాలయాలు, కాలేజీలపైన పర్యవేక్షణ ఉండాలి
⦿ ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నామో వచ్చే సమావేశంలో చెప్పాలి
ఈ సమీక్షా సమావేశానికి ప్లానింగ్ అండ్ రిసోర్స్ మొబలైజేషన్ స్పెషల్ సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, డీజీపీ గౌతమ్ సవాంగ్, రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ ఎస్ రావత్, ఇంటెలిజెన్స్ చీఫ్ కే వీ రాజేంద్రనాథ్ రెడ్డి, గనులశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార విశ్వజిత్, ఎస్‌ఈబీ కమిషనర్ వినీత్ బ్రిజ్‌లాల్, ఎస్‌ఈబీ డైరెక్టర్ (స్పెషల్ యూనిట్స్) ఏ రమేష్ రెడ్డి ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.