Saturday, January 18, 2025
HomeTrending Newsఇదేం పద్ధతి? సిఎం జగన్ సీరియస్

ఇదేం పద్ధతి? సిఎం జగన్ సీరియస్

What is this? గవర్నర్ ప్రసంగ సమయంలో తెలుగుదేశం పార్టీ సభ్యులు వ్యవహరించిన తీరుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  గవర్నర్ ప్రసంగం పూర్తయిన తరువాత అసెంబ్లీ బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశం స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన జరిగింది, ఈ భేటీలో సిఎం తో పాటు టిడిపి నుంచి అచ్చెన్నాయుడు కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా టిడిపి సభ్యుల ప్రవర్తనను సిఎం జగన్ తీవ్రంగా తప్పుబట్టినట్లు తెలిసింది. గవర్నర్ ను అవమానించారని, గతంలో ఎన్నడూ ఇలాంటి సంస్కృతి లేదని సిఎం ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. ‘గవర్నర్ మీ పార్టీ కాదు, మా పార్టీ కాదు, వయసులో పెద్ద వ్యక్తిని అవమానించడం సరికాదు’ అని సిఎం అన్నట్లు తెలిసింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్