కరోనా సంక్షోభ సమయంలో వైద్య సిబ్బంది అందిస్తున్న సేవలు అసమానమైనవని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ప్రాణాంతకం అని తెలిసినా సేవలు అందిస్తున్నారని, ప్రపంచంలో కేవలం తల్లి మాత్రమే అలాంటి సేవ చేయగలదని ఆయన భావోద్వేగంతో చెప్పారు. ‘మా వైపు నుంచి లేదా అధికారుల నుంచి ఏవైనా పొరపాట్లు జరిగితే మనసుకో పెట్టుకోవద్ద’ని విజ్ఞప్తి చేశారు. స్పందన కార్యక్రమంలో భాగంగా తన క్యాంపు కార్యాలయం నుంచి వైద్య సిబ్బందితో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. వైద్యులు, నర్సులు, ఏ ఎన్ ఏం లు, ఆశా వర్కర్లు, రెవెన్యు, పోలీసు సిబ్బంది విశేష సేవలందిస్తున్నారని కొనియాడారు.
వైద్య సిబ్బందికి ఏమిచ్చి ఋణం తీర్చుకోగలమని ప్రశ్నిస్తూ… వారికి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. రాష్ట్రంలోని ప్రతి పౌరుడి తరపున మీకు సెల్యూట్ చేస్తున్న అంటూ వ్యాఖ్యానించారు.