Saturday, March 14, 2026
HomeTrending News27న సిఎం జగన్ నెల్లూరు పర్యటన

27న సిఎం జగన్ నెల్లూరు పర్యటన

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈనెల 27న శ్రీ పొత్తు శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. నేలటూరులో ఏపీ జెన్కో ఆధ్వర్యంలో నెలకొల్పిన మూడో యూనిట్ ను ఆయన ప్రారంభించనున్నారు. 800 మెగావాట్ల సామర్ధ్యంతో ఈ యూనిట్ ను ఏర్పాటు చేశారు.

సిఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్  చక్రధర్ బాబు, ఏపీ జెన్కో ఎండి బి .శ్రీధర్ పరిశీలించారు. సిఎం తో పాటు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లాకు చెందిన మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కూడా పాల్గొంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular