Saturday, November 23, 2024
HomeTrending NewsWelfare: నేడు వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా

Welfare: నేడు వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా

వైఎస్సార్ కళ్యాణమస్తు,  వైఎస్సార్ షాదీ తోఫా  పథకాల కింద అర్హులైన లబ్దిదారులకు ప్రభుత్వం అందిస్తోన్న ఆర్ధిక సాయాన్ని నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విడుదల చేయనున్నారు.  ఏప్రిల్-జూన్, 2023 త్రైమాసికంలో వివాహం చేసుకుని, అర్హులుగా గుర్తించిన 18,883 జంటలకు రూ. 141.60 కోట్ల ఆర్థిక సాయాన్ని తాడేపల్లి లోని సీఎం క్యాంప్ కార్యాలయంలో వర్చువల్ గా బటన్ నొక్కి వధువు తల్లుల ఖాతాల్లో  జమ చేయనున్న్ననారు.

పేద తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించి, వారి వివాహాన్ని గౌరవ ప్రదంగా జరిపించే తమ సామాజిక బాధ్యత నిర్వర్తించేందుకు అండగా నిలుస్తూ.. ఎస్.సి, ఎస్.టి, బి.సి, మైనార్టీలు, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని ఆడపిల్లలకు “వైఎస్సార్ కళ్యాణమస్తు” ద్వారా, ముస్లిం మైనార్టీ వర్గాల ఆడపిల్లలకు “వైఎస్సార్ షాదీ తోఫా” ద్వారా ఆర్థిక సాయం అందిస్తోంది.

దూరదృష్టితో.. వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫాలకు అర్హత సాధించాలంటే వధూవరులిద్దరికీ 10th క్లాస్ ఉత్తీర్ణత తప్పనిసరి చేసింది. తద్వారా తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించేలా దోహదం.. దీంతో పాటు… పెళ్లి నాటికి అమ్మాయి వయస్సు 18 ఏళ్లు. అబ్బాయి వయస్సు 21 సంవత్సరాలు దాటి ఉండాలన్న నిబంధన వల్ల బాల్య వివాహాల నివారణతో పాటు వారు ఇంటర్ వరకు చదివేందుకు అమ్మ ఒడి సాయం, ఆ పై చదువులకు జగనన్న విద్యా దీవెన ద్వారా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్, భోజన, వసతి ఖర్చులకు సైతం జగనన్న వసతి దీవెన ద్వారా లబ్ధి ఉండడంతో వారు ఉన్నత విద్యావంతులు, గ్రాడ్యుయేట్లు అవుతారన్న తపన, తాపత్రయంతో పనిచేస్తున్నట్లు ప్రభుత్వం తెలియజేసింది.

ఇప్పుడు అందిస్తున్న సాయంతో కలిపి గడిచిన 9 నెలల్లోనే వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా క్రింద 35,551 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ. 267.20 కోట్లు జమ చేసినట్లు వెల్లడించింది. దూదేకుల, నూర్ బాషాల విజ్ఞప్తిని మన్నించి వారికి కూడా వైఎస్సార్ షాదీ తోఫా తో సమానంగా లబ్ధి రూ. 1,00,000 కు పెంచి అందిస్తున్న జగనన్న ప్రభుత్వం.. ఈ వర్గాలకు చెందిన అర్హులైన గత లబ్ధిదారులకు కూడా పెరిగిన ఈ పెంపు పథకం ప్రారంభం నుంచి బ్యాక్ డేట్ తో వర్తింపజేస్తోంది.

వైఎస్సార్ కళ్యాణము”, “వైఎస్సార్ షాదీ తోఫా” లకు సంబంధించి సలహాలు, సూచనలు, ఫిర్యాదుల కొరకు జగనన్నకు చెబుదాం 1902 టోల్ ఫ్రీ నెంబర్ పూర్తి వివరాలు నవశకం బెనిఫిషియరీ మేనేజ్ మెంట్ పోర్టల్ https//gsws-nbm.ap.gov.in/ వెబ్ సైట్ లో పొందవచ్చుని సూచించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్