Saturday, November 23, 2024
HomeTrending NewsCM Jagan: నేడు వైఎస్సార్ నేతన్న నేస్తం

CM Jagan: నేడు వైఎస్సార్ నేతన్న నేస్తం

సొంత మగ్గం కలిగిన ప్రతి చేనేత కుటుంబానికి వైఎస్సార్ నేతన్న నేస్తం ద్వారా  ఏడాదికి రూ. 24,000 ఆర్థిక సాయం అందిస్తున్న ప్రభుత్వం వరుసగా ఐదో ఏడాది నేడు ఈ కార్యక్రమాన్ని అమలు చేయనుంది.  రాష్ట్ర వ్యాప్తంగా 80,686 మంది నేతన్నలకు రూ.193.64 కోట్లను నేడు (21-07-2023)న శుక్రవారం తిరుపతి జిల్లా వెంకటగిరిలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు.

నేడు అందిస్తున్న సాయంతో కలిపి అర్హుడైన ప్రతి నేతన్నకు వైఎస్సార్ నేతన్న నేస్తం ద్వారా ఇప్పటివరకు  అందించిన మొత్తం సాయం రూ.1,20,000.  జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిననాటి నుంచి రూ. 969.77 కోట్లు, నేతన్నల పెన్షన్ కోసం రూ.1,396.45 కోట్లు, ఆప్కోకు చెల్లించింది రూ.468.84 కోట్లు (గత ప్రభుత్వ బకాయిలు రూ. 103 కోట్లతో కలిపి)… మొత్తంగా ఇప్పటి వరకు కేవలం ఈ 3 పథకాల ద్వారానే నేతన్నల సంక్షేమం కోసం చేసిన వ్యయం రూ.2,835.06 కోట్లు గా ప్రభుత్వం వెల్లడించింది.

గత ప్రభుత్వం నేతన్నల కోసం ఐదేళ్లలో కేవలం రూ.442 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తే, జగన్‌ ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా  కేవలం నాలుగేళ్లలోనే దాదాపు 9 రెట్లు అధికంగా రూ.3,706 కోట్లు ఖర్చు చేసిందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

శుక్రవారం ఉదయం సిఎం జగన్‌ తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి తిరుపతి జిల్లా వెంకటగిరి చేరుకుంటారు.
విశ్వోదయ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల సమీపంలో ఏర్పాటు చేసిన సభావేదిక వద్దకు చేరుకుని, బహిరంగసభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం వైఎస్సార్‌ నేతన్ననేస్తం పథకంలో భాగంగా అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో సీఎం నగదు జమ చేస్తారు.  ఆ తర్వాత స్థానిక త్రిభువన్‌ సెంటర్‌లో మాజీముఖ్యమంత్రి స్వర్గీయ నేదురుమల్లి జనార్ధనరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఈ కార్యక్రమం అనంతరం ముఖ్యమంత్రి తిరిగి తాడేపల్లి చేరుకుంటారు

RELATED ARTICLES

Most Popular

న్యూస్