Saturday, January 18, 2025
HomeTrending Newsఅగ్రి గోల్డ్‌ బాధితులకు భరోసా

అగ్రి గోల్డ్‌ బాధితులకు భరోసా

రాష్ట్ర ప్రభుత్వం రెండో విడతగా అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకునే  కార్యక్రమానికి నేడు శ్రీకారం చుడుతోంది. ఆగస్టు 24 మంగళవారం క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా బాధితుల ఖాతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నగదు జమ చేయనున్నారు.

2019 నవంబర్‌లో 10 వేల లోపు చెల్లించిన 3.70 లక్షల మంది డిపాజిటర్లకు రూ. 263.99 కోట్లు చెల్లించింది ప్రభుత్వం. నేడు మరో సారి మొదటి విడతలో లబ్ధి పొందని రూ. 10 వేల లోపు డిపాజిట్‌ దారులు 3.86 లక్షల మందికి 207.61 కోట్ల రూపాయలను…..రూ. 10 వేల నుంచి రూ. 20 వేల లోపు డిపాజిట్‌ చేసిన దాదాపు 3.14 లక్షల మంది బాధితులకు రూ. 459.23 కోట్లను మొత్తం కలిపి 666.84 కోట్ల రూపాయలను నేడు వారి ఖాతాల్లో జమ చేయనుంది ప్రభుత్వం.

గౌరవ హైకోర్టు నిర్దేశించిన విధంగా మొత్తం 7 లక్షల పైచిలుకు అర్హులైన అగ్రి గోల్డ్‌ బాధితులను పారదర్శకంగా గ్రామ, వార్డు వలంటీర్లు, సచివాలయాల ద్వారా గుర్తించి, సీఐడీ ద్వారా నిర్దారించి వారికి చెల్లింపులు చేస్తోంది. అగ్రిగోల్డ్ లో డిపాజిట్‌ చేసి మోసపోయిన బాధితులు ఏ ఒక్కరూ మానసిక క్షోభకు గురికాకూడదని, పాదయాత్రలో, వైఎస్సార్సీపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం డిపాజిట్‌ దారులకు చెల్లింపులు చేస్తున్నారు.

ఒక డిపాజిట్‌దారుడికి ఒకటికి మించి డిపాజిట్లు ఉన్నా, ఒక డిపాజిట్‌కి మాత్రమే చెల్లింపులు చేయాలని గౌరవ హైకోర్టు సూచించిన నేపధ్యంలో రూ. 20 వేల వరకూ డిపాజిట్‌ చేసిన మొత్తం 10.40 లక్షల అగ్రి గోల్డ్‌ బాధితులకు నేటితో అందించే మొత్తం మొత్తం 905.57 కోట్ల రూపాయలకు చేరుతుంది.

రాబోయే రోజుల్లో కోర్టులో ఉన్న ఈ వ్యవహారాన్ని ప్రభుత్వమే చొరవ చూపించి, భూములు అమ్మించి ప్రభుత్వానికి రావాల్సిన సొమ్ము తీసుకుని మిగిలిన సొమ్మును డిపాజిట్‌దారులకు మళ్ళీ చెల్లిస్తామని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్