Sunday, January 19, 2025
HomeTrending Newsనేడు జగనన్న విద్యా దీవెన

నేడు జగనన్న విద్యా దీవెన

Vidya Deevena:  విద్యార్ధుల పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌  మూడో త్రైమాసికం నిధులను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు విడుదల చేయనున్నారు. మొత్తం ఫీజును నాలుగు వాయిదాలలో ప్రతి త్రైమాసికం అనిత తరువాత ప్రభుత్వం చెల్లిస్తూ ఈనిధులను నేరుగా విద్యార్ధుల తల్లుల అకౌంట్లలో జమచేస్తోంది.  అక్టోబర్‌ – డిసెంబర్, 2021 త్రైమాసికానికి దాదాపు 10.82 లక్షల మంది విద్యార్ధులకు రూ. 709 కోట్లను నేడు బుధవారం మార్చి 16న సచివాలయంలోని తన ఛాంబర్ నుంచి  సీఎం వైఎస్‌ జగన్‌ బటన్‌ నొక్కి నేరుగా విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు.

అర్హులైన పేద విద్యార్ధులందరికీ పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వమే చెల్లించేలా ఈ పథకానికి రూపకల్పన జరిదింగి. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్‌ తదితర కోర్సులు చదివే పేద విద్యార్ధులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం అయిన వెంటనే విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తూ వస్తున్నారు.

జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాల క్రింద ఇప్పటివరకు జగన్‌ ప్రభుత్వం చెల్లించిన మొత్తం అక్షరాలా రూ. 9,274 కోట్లు. గత ప్రభుత్వం పెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ. 1,778 కోట్లు కూడా జగన్‌ ప్రభుత్వమే చెల్లించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్