Wednesday, May 7, 2025
HomeTrending Newsనేడు మూడో ఏడాది నేతన్న నేస్తం

నేడు మూడో ఏడాది నేతన్న నేస్తం

వైఎస్సార్‌ నేతన్న నేస్తం పథకాన్ని వరుసగా మూడో ఏడాది అమలు చేస్తోంది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం. నేడు (ఆగస్టు 10న) క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్‌ విధానం ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. ఈ ఏడాది 80,032 మంది నేతన్నలకు రూ. 192.08 కోట్ల ఆర్ధిక సాయాన్ని అందజేయనున్నారు.

కరోనా కష్టాలు ఎన్ని ఉన్నా పాదయాత్రలో ఇచ్చిన మాటకు కట్టుబడి నేతన్నలు మార్కెట్‌లో నిలదొక్కుకునేందుకు ఇస్తున్న కానుక…వైఎస్సార్‌ నేతన్న నేస్తం పథకం అని చేనేత అధికారులు వెల్లడించారు.  ఈ పథకం ద్వారా అర్హులై ఉండి స్వంత మగ్గం కలిగిన ప్రతీ చేనేత కుటుంబానికి ఏడాదికి రూ. 24,000 ఆర్ధిక సాయం ప్రభుత్వం అందించనుంది.

ఈ ఐదేళ్ళలో ఒక్కో లబ్ధిదారుడికి మొత్తం రూ. 1,20,000 ఆర్ధిక సాయం అందించనున్నారు. నేడు ఇస్తున్న సాయం ద్వారా ఆ మొత్తంలో ఇప్పటికే 72 వేల రూపాయల సాయం అందినట్లవుతుంది.  గత రెండేళ్ళలో 383.99 కోట్ల రూపాయల సాయం అందించిన ప్రభుత్వం నేడు మూడో విడత లో అందిస్తున్న రూ.192.08 కోట్లతో కలిపి ఇప్పటివరకూ అందించిన సాయం రూ. 576.07 కోట్లు అవుతుంది. ఈ సాయంతో నేతన్నలు గౌరవప్రదంగా జీవించేందుకు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆపన్న హస్తం అందిస్తుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్