Vasati Deevena: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు నంద్యాలలో పర్యటించి జగనన్నవసతి దీవెన కార్యక్రమంలో పాల్గొననున్నారు. 2021–22 విద్యా సంవత్సరానికి ఈ పథకం కింద రెండో విడతగా 10,68,150 మంది విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో 1,024 కోట్ల రూపాయలు సిఎం జగన్ బటన్ నొక్కి జమ చేయనున్నారు. ఇటీవలే జగనన్న విద్యా దీవెన కింద అక్టోబర్-డిసెంబర్, 2021 త్రైమాసికానికి పూర్తి ఫీజు రీఇంబర్స్‌మెంట్ కింద 709 కోట్ల రూపాయలు వారి తల్లుల అకౌంట్లలో జమ చేశారు.
జగనన్న వసతి దీవెన కింద ఏటా రెండు వాయిదాలలో ఐటీఐ విద్యార్ధులకు రూ. 10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్ధులకు రూ. 15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ. 20 వేల చొప్పున వసతి, భోజన ఖర్చుల కొరకు, కుటుంబంలో ఎంతమంది చదువుతుంటే అంతమందికి, వారి తల్లుల ఖాతాల్లో సంవత్సరానికి రెండు దఫాల్లో నేరుగా జమ చేస్తూ వస్తోంది జగన్ ప్రభుత్వం.
గత ప్రభుత్వ బకాయిలు దాదాపు రూ. 1,778 కోట్లతో కలిపి శ్రీ వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 34 నెలల్లోనే జగనన్న విద్యా దీవెన క్రింద రూ. 6,969 కోట్లు, జగనన్న వసతి దీవెన క్రింద రూ. 3,329 కోట్లు. ఇప్పటివరకూ పిల్లల చదువులకు అందించిన మొత్తం ఆర్ధిక సాయం అక్షరాలా రూ. 10,298 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసింది.
సిఎం జగన్ నేటి ఉదయం (ఏప్రిల్ 8న) ఉదయం 10 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి బయల్దేరి ఓర్వకల్ విమానాశ్రయానికి చేరుకొని, అక్కడినుంచి హెలికాఫ్టర్ లో నంద్యాల డిగ్రీ కాలేజ్ కి చేరుకుంటారు. స్థానిక ఎస్పీజీ గ్రౌండ్స్ లో జగనన్న వసతి దీవెన కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అనంతరం నంద్యాల నుంచి ఓర్వకల్…. అటు నుంచి గన్నవరం తిరుగు పయనమవుతారు. మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
Also Read : కాసేపట్లో ‘పేట’కు సిఎం: వాలంటీర్లకు సత్కారం