Monday, January 20, 2025
HomeTrending Newsనేడు జగనన్న విద్యా దీవెన

నేడు జగనన్న విద్యా దీవెన

జగనన్న విద్యా దీవెన కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు శ్రీకారం చుట్టనున్నారు.  ఈ ఏడాది రెండో విడతగా దాదాపు 10.97 లక్షల మంది విద్యార్ధులకు రూ. 693.81 కోట్లను క్యాంప్‌ కార్యాలయంలో కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నేరుగా తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు.

నిరుపేద విద్యార్ధులు కూడా పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో దేశంలో ఎక్కడాలేని విధంగా అర్హత ఉన్న ప్రతీ విద్యార్ధికి సకాలంలో, ఏ బకాయిలు లేకుండా పూర్తి ఫీజు రీఇంబర్స్ మెంట్‌ చేస్తోంది ప్రభుత్వం.

జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్‌ తదితర కోర్సులు చదివే పేద విద్యార్ధులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని ప్రతీ మూడు నెలలకోసారి విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తోంది ప్రభుత్వం.

మొత్తం నాలుగు విడతల్లో జగనన్న విద్యా దీవెన అందిస్తోంది. ఈ ఏడాది మొదటి విడత ఏప్రిల్‌ 19న అందించిన ప్రభుత్వం నేడు జులై 29న రెండవ విడత అందిస్తోంది. మూడవ విడత డిసెంబర్‌లో, నాలుగో విడత ఫిబ్రవరి 2022 లో అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

విద్యారంగంపై ఇప్పటివరకు చేసిన ఖర్చు ఈ రూ. 26,677.82 కోట్లే కాకుండా నాడు – నేడు పథకం క్రింద ప్రీప్రైమరీ స్కూళ్ళుగా మారబోతున్న అంగన్‌వాడీలలో పిల్లలు, తల్లుల పోషకాహారం కోసం వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ ద్వారా ఏటా మరో రూ. 1,800 కోట్ల వ్యయం కూడా చేస్తుంది జగన్‌ ప్రభుత్వం

RELATED ARTICLES

Most Popular

న్యూస్