Saturday, November 23, 2024
HomeTrending NewsCM Tour: నగరికి సిఎం జగన్- విద్యా దీవెన నిధుల విడుదల

CM Tour: నగరికి సిఎం జగన్- విద్యా దీవెన నిధుల విడుదల

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం చిత్తూరు జిల్లా నగరిలో పర్యటించనున్నారు. విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్  చెల్లించే  జగనన్న విద్యా దీవెన  కింద ఏప్రిల్ – జూన్ 2023 త్రైమాసికానికి సంబంధించిన నిధులను విడుదల చేయనున్నారు.  9,32,235 మంది లబ్ధి చేకూరుస్తూ రూ. 680.44 కోట్లను నగరిలో జరిగే బహిరంగ సభ అనంతరం బటన్ నొక్కి8,44,336 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు.

పేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో.. ఐటిఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే కుటుంబంలో ఎంత మంది పిల్లలుంటే అంత మంది పిల్లలకు ఇచ్చేలా. వారి తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తూ వస్తోంది. రాష్ట్రంలో ప్రతి పేద విద్యార్థి ఉన్నత విద్యను అభ్యసించేలా పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ మరియు వసతి సౌకర్యాలను అందిస్తూ జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాలు అమలు చేస్తోంది.

నేడు అందిస్తున్న లబ్ధి రూ. 680.44 కోట్లతోపాటు, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన క్రింద ఇప్పటి వరకు  అందించిన మొత్తం సాయం రూ. 15,593 కోట్లు అని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

విద్యారంగంపై ప్రభుత్వం చేసిన వ్యయం వివరాలను కూడా ప్రభుత్వం తెలియజేసింది.

జగనన్న అమ్మ ఒడి – లబ్ధిదారుల సంఖ్య – 44,48,865 అందించిన మొత్తం రూ. కోట్లలో 26,067

జగనన్న విద్యా దీవెన – లబ్ధిదారుల సంఖ్య – 26,98,728 అందించిన మొత్తం రూ. కోట్లలో 11,317

జగనన్న వసతి దీవెన – లబ్ధిదారుల సంఖ్య – 25,17,245 అందించిన మొత్తం రూ. కోట్లలో 4,276

జగనన్న విదేశీ విద్యా దీవెన – లబ్ధిదారుల సంఖ్య – 1,925  అందించిన మొత్తం రూ. కోట్లలో 178

జగనన్న గోరుముద్ద – లబ్ధిదారుల సంఖ్య – 43,26,782 అందించిన మొత్తం రూ. కోట్లలో 4,287

జగనన్న విద్యా కానుక – లబ్ధిదారుల సంఖ్య – 47,40,421 అందించిన మొత్తం రూ. కోట్లలో 3,367

వైఎస్సార్ సంపూర్ణ పోషణ – లబ్ధిదారుల సంఖ్య – 35,70,675 అందించిన మొత్తం రూ. కోట్లలో 6,688

స్వేచ్ఛ(శానిటరీ న్యాప్కిన్స్) – లబ్ధిదారుల సంఖ్య – 10,01,860 అందించిన మొత్తం రూ. కోట్లలో 32

8 వ తరగతి విద్యార్ధులు, టీచర్లకు ట్యాబ్లు – లబ్ధిదారుల సంఖ్య – 5,18,740 అందించిన మొత్తం రూ. కోట్లలో 686

6 వ తరగతి నుంచి తరగతి గదుల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ 30,213, ఇతర పాఠశాలల్లో స్మార్ట్ టీవీలు 10,038  అందించిన మొత్తం రూ. కోట్లలో 455

నగరిలో సిఎం పర్యటన ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా… ఉప ముఖ్యమంత్రి కె. నారాయణ స్వామి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, అధికారులతో కలిసి పరిశీలించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్