Saturday, November 23, 2024
HomeTrending Newsవైఎస్సార్‌ కళ్యాణమస్తు, షాదీ తోఫా సాయం విడుదల

వైఎస్సార్‌ కళ్యాణమస్తు, షాదీ తోఫా సాయం విడుదల

జనవరి–మార్చి త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 12,132 మంది లబ్ధిదారులకు వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా క్రింద రూ. 87.32 కోట్ల ఆర్ధిక సాయాన్ని నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  క్యాంప్‌ కార్యాలయంలో బటన్‌ నొక్కి వారి ఖాతాల్లో జమ చేశారు.

పేద తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించి వారి వివాహాన్ని గౌరవప్రదంగా జరిపించి తమ సామాజిక బాధ్యత నిర్వర్తించేందుకు అండగా నిలుస్తూ, ఎస్‌సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని ఆడపిల్లలకు వైఎస్సార్‌ కళ్యాణమస్తు ద్వారా, ముస్లిం మైనార్టీ వర్గాల ఆడపిల్లలకు వైఎస్సార్‌ షాదీ తోఫా ద్వారా ఆర్ధిక సాయం అందిస్తోంది.

కేవలం వందకు వంద శాతం అక్షరాస్యతే మన లక్ష్యం కాదు, వందకు వంద శాతం గ్రాడ్యుయేట్‌లుగా మన పిల్లలను తీర్చిదిద్దాలన్న సమున్నత లక్ష్యంతో వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫాలకు పదవ తరగతి ఉత్తీర్ణత, వధువుకు కనీస వయోపరిమితి 18 ఏళ్ళుగా, వరునికి 21 ఏళ్ళుగా నిర్ధేశించినట్లు సిఎం జగన్ గతంలోనే వెల్లడించారు.

వధూవరులు వివాహమైన 30 రోజుల లోపు తమ దగ్గర లోని గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే  సంబంధిత అధికారులు ఫీల్డ్‌ వెరిఫికేషన్‌ చేసి వివరాలను ధృవీకరించుకుని, ప్రతి ఏటా ఫిబ్రవరి, మే, ఆగష్టు, నవంబర్‌లలో ఆయా త్రైమాసికాలకు సంబంధించిన అర్హులైన లబ్ధిదారులకు ఆర్ధిక సాయం అందిస్తారు.

మధ్య దళారుల ప్రమేయం లేకుండా గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అర్హులైన వధువులందరికీ రూ. 1,50,000 వరకు ఆర్ధిక సాయం అందుతుంది.

రాష్ట్రంలోని మహిళలకు సాధికారత కల్పించాలనే లక్ష్యంతో కులాంతర వివాహాలు చేసుకున్న వధువులకు వారి ఖాతాలోనే, అదే కులంలో వివాహాలు చేసుకున్న వధువులకు వారి తల్లుల బ్యాంకు ఖాతాల్లో ఆర్ధిక సాయం అందిస్తోంది.

ఇప్పుడు అందిస్తున్న సాయంతో కలిపి గడిచిన ఆరు నెలల్లోనే వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా క్రింద 16,668 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ. 125.50 కోట్లు  జగన్‌ ప్రభుత్వం జమ చేసినట్లు అయింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్