Friday, April 4, 2025
HomeTrending Newsనేడు మూడో ఏడాది వైఎస్సార్‌ కాపు నేస్తం

నేడు మూడో ఏడాది వైఎస్సార్‌ కాపు నేస్తం

రాష్ట్రవ్యాప్తంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన మహిళలకు ఆర్ధికంగా చేయూత అందించేందుకు ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వైఎస్సార్ కాపు నేస్తం పథకాన్ని వరుసగా మూడో ఏడాది ప్రభుత్వం అమలు చేస్తోంది. కాకినాడ జిల్లా గొల్లప్రోలులో నేడు జరిగే కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. అర్హులైన 3,38,792 మంది పేద అక్కచెల్లెమ్మలకు రూ. 508.18 కోట్ల ఆర్ధిక సాయం అందించనున్నారు.

వైఎస్సార్‌ కాపు నేస్తం ద్వారా 45 నుంచి 60 ఏళ్ళ లోపు ఉన్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన పేద అక్కచెల్లెమ్మలకు ఏటా రూ. 15 వేల చొప్పున 5 ఏళ్ళలో మొత్తం రూ. 75,000 ఆర్దిక సాయం అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే రెండేళ్లపాటు అందించిన సాయంతో పాటు నేడు ఇస్తోన్న రూ. 508.18 కోట్లతో కలిపి మొత్తం లబ్ధి రూ. 1,491.93 కోట్లు.

మూడేళ్ళలోనే వివిధ పథకాల ద్వారా 70,94,881 మంది కాపు కులాల అక్కచెల్లెమ్మలకు, అన్నదమ్ములకు దాదాపు రూ.32,296.37 కోట్ల లబ్ధి చేకూరిందని ప్రభుత్వం వెల్లడించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్