రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటి నుండి పదవ తరగతి వరకు చదువుతున్న 43,10,165 మంది వరుసగా నాలుగో ఏడాది జగనన్న విద్యా కానుకను ప్రభుత్వం అందిస్తోంది. విద్యార్థినీ విద్యార్థులకు యూనిఫాం, పుస్తకాలు, బూట్లతో పాటు మొత్తం తొమ్మిది రకాల వస్తువులతో కలిపిన కిట్ ను అందించే ఈ పథకాన్ని నేడు (12.06.2023) పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని క్రోసూరులో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు.
రూ. 1,042.53 కోట్ల ఖర్చుతో జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ చేస్తోంది. ప్రతి విద్యార్థికి ఉచితంగా బైలింగువల్ పాఠ్య పుస్తకాలు (ఒక పేజీలో ఇంగ్లీష్ మరో పేజీలో తెలుగులో పాఠ్యాంశాలు), నోట్ బుక్ లు, వర్క్ బుక్ లు, 3 జతల యూనిఫామ్ క్లాత్ కుట్టు కూలితో సహా, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, స్కూలు బ్యాగు తో పాటు ఆక్స్ఫర్డ్ ఇంగ్లీషు-తెలుగు డిక్షనరీ (6-10 తరగతి పిల్లలకు), పిక్టోరియల్ డిక్షనరీ (1-5 తరగతి పిల్లలకు) తో కూడిన జగనన్న విద్యాకానుక కిట్ ను విద్యా సంవత్సరం మొదలవుతోన్న తొలిరోజే అందిస్తోంది. ఈ కిట్ కోసం ప్రతి విద్యార్థిపై దాదాపు రూ.2,400లను ఖర్చు చేస్తోంది.
ఇది కేవలం విద్యా రంగంలో సంస్కరణలపై మాత్రమే జగనన్న ప్రభుత్వం ఈ 4 ఏళ్లలో చేసిన వ్యయం వివరాలను అధికారులు వెల్లడించారు.
- జగనన్న అమ్మ ఒడి లబ్ధిదారుల సంఖ్య 44,48,865, అందించిన మొత్తం రూ. కోట్లలో 19,674.34
- జగనన్న విద్యాకానుక లబ్ధిదారుల సంఖ్య 47,40,421, అందించిన మొత్తం రూ. కోట్లలో 3,366.53
- జగనన్న గోరుముద్ద లబ్ధిదారుల సంఖ్య 43,26,782, అందించిన మొత్తం రూ. కోట్లలో 3,590.00
- పాఠశాలల్లో నాడు నేడు మొదటి దశ స్కూల్స్ 15,715 రూ. కోట్లలో 3,669.00
పాఠశాలల్లో నాడు నేడు రెండో దశ స్కూల్స్ 22,344 రూ. కోట్లలో 8,000.00
మూడు దశల్లో రూ. 17,805 కోట్ల వ్యయంతో మొత్తం 45,975 స్కూల్స్ లో అభివృద్ది పనులు - వైఎస్సార్ సంపూర్ణ పోషణ లబ్ధిదారుల సంఖ్య 35,70,675 అందించిన మొత్తం రూ. కోట్లలో 6,141.34
- స్వేచ్ఛ (శానిటరీ న్యాప్కిన్స్) లబ్ధిదారుల సంఖ్య 10,01,860 అందించిన మొత్తం రూ. కోట్లలో 32.00
- 8 వ తరగతి విద్యార్ధులు, టీచర్లకు ట్యాబ్ లు డిజిటల్ విద్యను ప్రోత్సహిస్తూ లబ్ధిదారుల సంఖ్య 5,18,740 అందించిన మొత్తం రూ. కోట్లలో 685.87
- జగనన్న విద్యా దీవెన లబ్ధిదారుల సంఖ్య 26,98,728 అందించిన మొత్తం రూ. కోట్లలో 10,636.67
- జగనన్న వసతిదీవెన లబ్ధిదారుల సంఖ్య 25,17,245 అందించిన మొత్తం రూ. కోట్లలో 4,275.76
- జగనన్న విదేశీ విద్యాదీవెన లబ్ధిదారుల సంఖ్య 1,858 అందించిన మొత్తం రూ. కోట్లలో 132.41
- వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా లబ్ధిదారుల సంఖ్య 16,668 అందించిన మొత్తం రూ. కోట్లలో 125.50
- మొత్తం రూ. 60,329.42 కోట్లు