రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు కృష్ణా జిల్లా గుడివాడలో పర్యటించనున్నారు. గుడివాడ మున్సిపాలిటీ పరిథిలోని మల్లాయపాలెంలో 77 ఎకరాల ఒకే లేఅవుట్ లో పూర్తయిన 8, 912 టిడ్కోఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. అక్కడే మరో 178.63 ఎకరాల్లో 7,728 ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి వీటిలో తోలి దశలో నిర్మించనున్న 4,500 ఇళ్లకు భూమి పూజ చేస్తారు.
గుడివాడ నియోజకవర్గంలో 84 “వైఎస్సార్-జగనన్న”లే అవుట్లలో 13, 145 ఇళ్ల పట్టాలు మంజూరు కాగా వీటి విలువ దాదాపు రూ. 657 కోట్లు అని… నవరత్నాలు – పేదలందరికీ ఇళ్ల క్రింద 8,859 ఇళ్ల మంజూరయ్యాయని, వీటి విలువ దాదాపు రూ. 239 కోట్లుగా ప్రభుత్వం వెల్లడించింది. మౌలిక వసతులకు మరో రూ.87 కోట్లు ఖర్చు చేస్తున్నామని… ఇళ్ల స్థలాలు, ఇళ్లు, మౌలిక వసతులతో కలిపి గుడివాడలో అందిస్తున్న ఇళ్ల విలువ రూ. 983 కోట్లు అని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది.
గుడివాడలో నేడు పంపిణీ చేస్తున్న 8,912 టిడ్కో ఇళ్ళకు…. నిర్మాణం, మౌలిక వసతులు, స్థల సేకరణకు చేసిన మొత్తం వ్యయం రూ. 799.19 కోట్లు కాగా,
గుడివాడ నియోజకవర్గంలో ఈ టిడ్కో ఇళ్లపై చేసిన ఖర్చు మొత్తం రూ. 1,782కోట్లు అని ప్రకటించింది.
అక్కచెల్లెమ్మలకు సాధికారత కల్పించడమే లక్ష్యంగా అక్కచెల్లెమ్మల పేరు మీద ఇళ్ల పట్టాలు, ఇళ్ల రిజిస్టేషన్లు ఇస్తూ రూ. 2 లక్షల కోట్ల నుండి రూ.3 లక్షల కోట్ల సంపద వారి చేతుల్లో పెడుతున్నామని వివరించింది.