Monday, September 23, 2024
HomeTrending Newsనేడు రాష్ట్ర స్థాయి 'జగనన్న ఆణిముత్యాలు'

నేడు రాష్ట్ర స్థాయి ‘జగనన్న ఆణిముత్యాలు’

ప్రభుత్వ, ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్న విద్యాసంస్థల్లో చదువుతూ పది, ఇంటర్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్ధినీ విద్యార్ధులకు ప్రోత్సాహకాలు అందించే ఉద్దేశంతో ‘ జగనన్న ఆణిముత్యాలు’ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటికే నియోజకవర్గ, జిల్లా స్థాయిల్లో అవార్డులను అందజేయగా రాష్ట్ర స్థాయిలో  నేడు అందించనున్నారు.

‘జగనన్న ఆణిముత్యాలు – స్టేట్ బ్రిలియన్స్ అవార్డ్స్ -2023’ పేరిట నేడు (20.06.2023) విజయవాడ ‘ఎ’ కన్వెన్షన్ సెంటర్ లో జరిగే కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వయంగా విద్యార్ధులను సత్కరించనున్నారు. రాష్ట్రస్థాయిలో పదవ తరగతిలో టాపర్ గా నిలిచిన 42 మంది, ఇంటర్మీడియట్ గ్రూపుల వారీగా టాపర్స్ గా సత్తా చాటిన 26 మంది విద్యార్థులను సత్కరిస్తారు.

వీరితో పాటు ఉన్నత విద్యలో 5 కేటగిరీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 20 మంది విద్యార్ధులకు ” స్టేట్ ఎక్స్ లెన్స్ అవార్డులు” కూడా ప్రదానం చేయనున్నారు.

10th, Inter  పరీక్షల్లో ప్రతిభ చూపి రాష్ట్ర స్థాయి నుంచి నియోజకవర్గాల స్థాయిలో అవార్డులు అందుకుంటున్న మొత్తం విద్యార్ధుల సంఖ్య 22,710 మంది

  • పదవ తరగతి రాష్ట్రస్ధాయి నగదు పురస్కారం (రూ.) ప్రథమ 1.00.000, ద్వితీయ 75,000, తృతీయ 50,000; విద్యార్ధులు-42
  • జిల్లా స్ధాయి నగదు పురస్కారం (రూ.) ప్రథమ 50,000, ద్వితీయ 30,000, తృతీయ 15,000; విద్యార్ధులు- 609
  • నియోజకవర్గ స్ధాయి నగదు పురస్కారం (రూ.) ప్రథమ 15,000, ద్వితీయ 10,000, తృతీయ 5,000; విద్యార్ధులు-681
  • పాఠశాల స్ధాయి నగదు పురస్కారం (రూ.) ప్రథమ 3,000, ద్వితీయ 2,000, తృతీయ 1,000; విద్యార్ధులు-20,299
  • ఇంటర్మీడియట్ రాష్ట్ర స్ధాయి గ్రూపుల వారీగా టాపర్స్ కు నగదు పురస్కారం రూ. 1,00,000; విద్యార్ధులు-26
  • ఇంటర్మీడియట్ జిల్లా స్ధాయి గ్రూపుల వారీగా టాపర్స్ కు నగదు పురస్కారం రూ. 50,000;  విద్యార్ధులు-391
  • ఇంటర్మీడియట్ నియోజకవర్గ స్ధాయి గ్రూపుల వారీగా టాపర్స్ కు నగదు పురస్కారం రూ. 15,000; విద్యార్ధులు- 662
  • ర్యాంకర్లకు సమాన మార్కులతో ఎంతమంది ఉన్నా అందరికి సత్కారం.. ప్రతి ఒక్క విద్యార్థికి నగదు తో పాటు సర్టిఫికెట్, మెడల్ అందజేత

పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తూ కార్పొరేట్ బడులే ప్రభుత్వ బడులతో పోటీపడేలా విద్యావ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలు అమలు చేస్తున్న జగనన్న ప్రభుత్వం ఈ నాలుగేళ్లలో కేవలం విద్యా రంగ సంస్కరణలపై చేసిన వ్యయం. అక్షరాలా రూ. 60,329 కోట్లు అని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్