గ్రామ, వార్డు స్థాయిలో ప్రజలకు విశేష సేవలందిస్తోన్న వాలంటీర్లను ప్రభుత్వం నేడు సత్కరించనుంది. ‘వాలంటీర్లకు వందనం’ పేరిట వరసగా మూడో ఏడాది … ఉత్తమ ప్రతిభ కనబరిచిన గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లకు సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డుల ప్రధానం చేయనుంది. విజయవాడ ఎ ప్లస్ కన్వెన్షన్ సెంటర్‌లో జరగనున్న ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.
ప్రతి నెలా మొదటి తారీఖునే ఠంఛన్ గా లబ్ధిదారుల గడప వద్దకు వచ్చి, ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్లను అవ్వాతాతలకు అందించడంతో పాటు వివిధ సంక్షేమ పథకాలపై వాలంటీర్లు అవగాహన కల్పిస్తున్నారు. పారదర్శకంగా లబ్ధిదారులను గుర్తించడం, అర్హులందరికీ లబ్ధి అందేలా చేయి పట్టుకొని నడిపిస్తూ, ప్రతి 50 ఇళ్లకు ఒక బిడ్డగా ఉంటూ వైఎస్ జగన్ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా నిలబడి సేవాభావంతో విధులు నిర్వహిస్తున్నారని ప్రభుత్వం కొనియాడింది. లంచాలు, వివక్షకు తావులేకుండా సేవలందిస్తున్న వాలంటీర్ చెల్లెమ్మలకు, వాలంటీర్ తమ్ముళ్లకు సెల్యూట్ చేస్తూ వారి సేవలను గుర్తించి వారికి ప్రోత్సాహకంగా అందిస్తున్న చిరు సత్కారమే ఇదని పేర్కొంది.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,33,719 మందికి రూ. 243.34 కోట్ల నగదు పురస్కారాలు. అందిస్తోంది. దీనితో కలిపి ఇప్పటివరకు వాలంటీర్లకు అందించిన నగదు పురస్కారాల మొత్తం రూ. 705.68 కోట్లకు చేరుకుంది.
నేడు (మే 19 )నుండి అన్ని నియోజకవర్గాల్లో పండగ వాతావరణంలో వాలంటీర్లకు అవార్డుల ప్రదానం మొదలు కానుంది. కనీసం సంవత్సర కాలంగా నిరంతరాయంగా సేవలందిస్తున్న వాలంటీర్లకు, వారు అందించిన సేవల ఆధారంగా 3 కేటగిరీల్లో పురస్కారాలు..
సేవా వజ్ర
సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్, మెడల్‌తో పాటు రూ. 30,000 నగదు బహుమతి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యుత్తమ ర్యాంకు సాధించిన మొదటి ఐదుగురు వాలంటీర్లకు 175 నియోజకవర్గాల్లో 875 మంది వాలంటీర్లకు సేవా వజ్ర పురస్కారాల ప్రధానం
సేవా రత్న:
సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్, మెడల్‌తో పాటు రూ. 20,000 నగదు బహుమతి. ప్రతి మండలం, మున్సిపాలిటీ పరిధిలో ఐదుగురు చొప్పున, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 10 మంది చొప్పున టాప్ 1 శాతం ర్యాంకు సాధించిన వాలంటీర్లకు, మొత్తంగా 4,220 మందికి సేవా రత్న పురస్కారాల ప్రధానం
సేవా మిత్ర:
సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్, మెడల్‌తో పాటు రూ. 10,000 నగదు బహుమతి. రాష్ట్రవ్యాప్తంగా ఏడాది పాటు ఎటువంటి ఫిర్యాదులు, వివాదాలు లేకుండా పనిచేసిన వాలంటీర్లకు 2,28,624 మందికి సేవా మిత్ర పురస్కారాల ప్రధానం