New Cabinet: రాష్ట్ర నూతన మంత్రివర్గం పదవీ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం దగ్గర పడుతుండడంతో జాబితాకు తుదిరూపు ఇచ్చే పనిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిమగ్నమయ్యారు. మంత్రి వర్గాన్ని ప్రక్షాళన చేయాలని సిఎం జగన్ నిర్ణయించడంతో మొన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో మంత్రులందరూ తమ రాజీనామాలను సమర్పించిన విషయం తెలిసిందే. నూతన మంత్రివర్గం ఎల్లుండి, సోమవారం ఏప్రిల్ 11న ఉదయం 11.31 నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేయనుంది.
ముహూర్తానికి ఇంకా రెండ్రోజులు మాత్రమేసమయం ఉండడం, అందులోనూ రేపు ఆదివారం, శ్రీరామ నవమి సెలవు కావడంతో ఈరోజే జాబితాను ఈ సాయంత్రం లేదా రేపు ఉదయం ఖరారు చేసి రాజ్ భవన్ కు పంపాలని సిఎం జగన్ భావిస్తున్నారు.
పాత మంత్రివర్గం నుంచి కేవలం మూడు నుంచి ఐదుగురికి మాత్రమే కొనసాగింపు ఉంటుందని తొలుత భావించినా, ఇప్పుడు ఈ సంఖ్య 11 వరకూ ఉండొచ్చని తెలుస్తోంది, ఎన్నికల సమయంలో సీనియారిటీని కాదని కేవలం సామాజిక సమీకరణలే ప్రాతిపదికగా తీసుకుంటే కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉందని సిఎం పునరాలోచనలో పడ్డట్లు సమాచారం. అయితే సిఎం జగన్ స్వభావం తెలిసిన వారు మాత్రం ప్రక్షాళన భారీగానే ఉంటుందని, అనూహ్యమైన మార్పులే ఉంటాయని ఘంటాపథంగా చెబుతున్నారు.
పార్టీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డి, సీనియర్ మంత్రులతో సిఎం భేటీ జరిపి ఈ మధ్యాహ్నానికి జాబితాను విడుదల చేస్తారని కూడా తెలియవచ్చింది.
Also Read : ఎలాంటి బాధ లేదు: రాజీనామాలపై నాని