పలాసలో కిడ్నీ వ్యాధి సమస్య శాశ్వత పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన డాక్టర్ వైఎస్సార్ సుజలధార ఉద్దానం మంచినీటి ప్రాజెక్ట్, పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు డిసెంబర్ 14న ప్రారంభించనున్నారు.
నాలుగు దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న కిడ్నీ సమస్య నివారణ చర్యల్లో భాగంగా సిఎం జగన్ రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వాటిలో మొదటిది ₹742 కోట్లతో వంశధార ప్రాజెక్టు ద్వారా వైఎస్సార్ సుజలధార పథకం కింద ఇంటింటికీ కుళాయిల ద్వారా రక్షిత తాగునీరు అందించనున్నారు. రెండవది రూ. 85 కోట్లతో డా. వైఎస్సార్ కిడ్నీ పరిశోధన-ఆస్పత్రిని 200 పడకలతో నిర్మించారు. ఈ రెంటికీ నేడు శ్రీకారం చుట్టనున్నారు.
గురువారం ఉదయం 8 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి కంచిలి మండలం మకరాంపురం చేరుకుంటారు, అక్కడ డాక్టర్ వైఎస్సార్ సుజలధార ఉద్దానం మంచినీటి ప్రాజెక్టును…, ఆ తర్వాత పలాస చేరుకుని కిడ్నీ రీసెర్చ్ సెంటర్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభిస్తారు, అనంతరం రైల్వే క్రీడా మైదానంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం తాడేపల్లి చేరుకుంటారు.