Sunday, January 19, 2025
HomeTrending Newsఅక్టోబర్ 2న క్లాప్, స్వచ్ఛ సంకల్పం: పెద్దిరెడ్డి

అక్టోబర్ 2న క్లాప్, స్వచ్ఛ సంకల్పం: పెద్దిరెడ్డి

క్లాప్, జగనన్న స్వచ్ఛసంకల్పం కార్యక్రమాలను సిఎం జగన్ అక్టోబర్ 2న విజయవాడలో ప్రారంభిస్తారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి వెల్లడించారు. తాడేపల్లిలోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం నుంచి వైయస్‌ఆర్‌ ఆసరా, చేయూత, జగనన్న స్వచ్ఛసంకల్పంపై జిల్లా కలెక్టర్లు, జెసి, డ్వామా పిడిలతో పెద్దిరెడ్డి వీడియో కాన్ఫెరెన్స్‌నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా వంద రోజుల పాటు క్లాప్, జగనన్న స్వచ్ఛసంకల్పం కార్యక్రమాలు జరుపుతామని వివరించారు.

ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ…

⦿ ఆరోగ్యవంతమైన, పరిశుభ్రమైన గ్రామాలే లక్ష్యంగా పనిచేయాలన్నది జగన్ ఆశయం
⦿ కరోనా వంటి సంక్షోభ సమయంలో ఆరోగ్యానికి ఉన్న ప్రాధాన్యతను గుర్తించాలి
⦿ జగనన్న స్వచ్ఛసంకల్పంలో ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలి
⦿ గతంలో నిర్వహించిన పచ్చదనం-పరిశుభ్రతా పక్షోత్సవాలకు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది
⦿ గ్రామాల్లో అహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకుందాం
⦿ పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి
⦿ గ్రామాలకు అవసరమైన అన్ని వనరులను ప్రభుత్వం అందిస్తుంది
⦿ ప్రజాభాగస్వామ్యంతోనే స్వచ్ఛసంకల్పం విజయవంతం అవుతుంది
⦿ అక్టోబర్ 7వ తేదీన వైయస్‌ఆర్ ఆసరా కార్యక్రమాన్ని సిఎం జగన్ ప్రారంభిస్తారు
⦿ అర్హత ఉన్న ఎస్‌హెచ్‌జి మహిళల వ్యక్తిగత ఖాతాలకే ఆసరా సొమ్మును జమ చేస్తాం
⦿ ప్రతి నియోజకవర్గంలోనూ పదిరోజుల పాటు ఆసరా కార్యక్రమాలు
⦿ ఆసరా అమలులో ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలి
⦿ మహిళలను ఆర్థిక స్వావలంభన దిశగా నడిపించాలనే లక్ష్యంతో సీఎం పనిచేస్తున్నారు
⦿ ఆసరా, చేయూత వంటి పథకాల ద్వారా మహిళలు ఆర్థికంగా బలపడాలి
⦿ అందుకు అవసరమైన సహకారాన్ని ప్రభుత్వం అందిస్తుంది
⦿ మార్కెటింగ్, రుణాల లభ్యత విషయంలో జిల్లా కలెక్టర్లు ఎస్‌హెచ్‌జి మహిళలకు మార్గదర్శనం చేయాలి

RELATED ARTICLES

Most Popular

న్యూస్