OTS Scheme to launch:
జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పశ్చిమగోదావరి జిల్లా తణుకులో లాంఛనంగా ప్రారంభించనున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు పేదలకు ప్రభుత్వాలు గృహ నిర్మాణ పథకాల ద్వారా అందించిన ఇళ్ళకు కేవలం నివసించే హక్కులు మాత్రమే ఇస్తున్నాయని, కానీ ఈ పట్టాలు వారి పేరుమీద రిజిస్ట్రేషన్ చేసి వారికి శాశ్వత హక్కులు కల్పించేందుకే జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకానికి శ్రీకారం చుడుతున్నామని ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్రవ్యాప్తంగా లభిదారులకు ఈ పథకం ద్వారా రూ.10,000 కోట్ల రుణమాఫీతో పాటు 6 వేల కోట్ల రూపాయల మేర రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ ఛార్జీల మినహాయింపుతో మొత్తం 16 వేల కోట్ల రూపాయల లబ్ధి చేకూరనుంది.
లబ్ధిదారులు తీసుకున్న రుణాల్లో అసలు, వడ్డీ ఎంత ఉన్నా నామమాత్రపు ధర చెల్లిస్తే రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. గ్రామాలలో రూ. 10 వేలు, మున్సిపాలిటీలలో రూ. 15 వేలు, కార్పొరేషన్లలో రూ. 20 వేలు లబ్దిదారులు చెల్లిస్తే మిగిలిన మొత్తం మాఫీ చేసి ర్తి హక్కులు కల్పిస్తామని భరోసా ఇస్తోంది. పథకం పూర్తిగా స్వచ్ఛందమని ఎలాటి ఒత్తిడీ లేదని కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది.
గత ప్రభుత్వ హయాంలో 2014–19 మధ్య ఐదేళ్ళలో అధికారులు 5 సార్లు వడ్డీ మాఫీ ప్రతిపాదనలు పంపినా ఏదో ఒక నెపంతో తిప్పిపంపి, రుణం సంగతి అటుంచి కనీసం వడ్డీ కూడా మాఫీ చేయలేదని అధికార పార్టీ అంటోంది. 43 వేల మంది లబ్ధిదారులు వారి అసలు, వడ్డీ కలిపి రూ. 15.29 కోట్లు చెల్లించినప్పటికీ ఎలాంటి యాజమాన్య హక్కులు పొందలేదని, వారికి కూడా నేడు ఉచితంగా సంపూర్ణ గృహ హక్కు కల్పిస్తున్నమని వెల్లడించింది.
జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ద్వారా ఇప్పటికే లబ్దిపొందిన 8.26 లక్షల మందికి నేటి నుంచి రిజిస్ట్రేషన్ పట్టాలు అందజేయనున్నారు.
Also Read : రామతీర్థం ఆలయానికి ఎల్లుండి శంకుస్థాపన