Sunday, February 23, 2025
HomeTrending Newsసిఎం టూర్ ఏర్పాట్లు పరిశీలించిన టిటిడి ఈవో

సిఎం టూర్ ఏర్పాట్లు పరిశీలించిన టిటిడి ఈవో

CM tour: రాష్ట్ర  ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 5న తిరుపతిలో పర్యటించనున్నారు. 300 కోట్ల రూపాయలతో నిర్మించిన టాటా క్యాన్సర్ హస్పిటల్ ను ప్రారంభించనున్నారు. 240 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న చిన్నపిల్లల హస్పిటల్ కి శంకుస్థాపన చేస్తారు. అనతరం 468 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తోన్న శ్రీనివాస సేతు ప్రాజెక్టు మొదటి దశ పనులను ప్రారంభిస్తారు.

ఈ సందర్భంగా టీటీడీ ఈవో జవహర్ రెడ్డి , అడిషనల్ ఈవో ధర్మారెడ్డి,  జిల్లా కలెక్టర్ కే వెంకట రమణారెడ్డి , జెసి బాలాజీ, నగరపాలక కమిషనర్ అనుపమ అంజలి , జెఇఓ వీరబ్రహ్మం , ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి,  సి వి అండ్ ఎస్ ఓ నరసింహ కిషోర్ , అధికారులు ముఖ్యమంత్రి పర్యటించనున్న ప్రాంతాలను పరిశీలించారు.  అధికారులకు పలు సూచనలు చేశారు . అనంతరం టిటిడి పరిపాలనా భవనం లో ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి  టాటా కాన్సర్ ఆసుపత్రి ప్రారంబోత్సవం , విద్యాకానుక బహిరంగ సభ  ఏర్పాటు , పోలీస్ భద్రత వంటి అంశాలు పై సమీక్ష నిర్వహించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్