Sunday, January 19, 2025
HomeTrending Newsవిద్యలో విప్లవాత్మక మార్పులు :సిఎం

విద్యలో విప్లవాత్మక మార్పులు :సిఎం

నూతన విద్యా విధానం ద్వారా తీసుకు వస్తున్న విప్లవాత్మక మార్పులు వల్ల విద్యార్ధుల సంఖ్యకు తగినట్టుగా టీచర్లు ఉంటారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు. క్యాంపు కార్యాలయంలో నూతన విద్యావిధానంపై సీఎం సమీక్షించారు. ఆగస్టు 16న విద్యా సంస్థలు మొదలవుతున్న రోజునే ఈ ఏడాది విద్యా కానుక పంపిణీ చేయాలని సమావేశంలో నిర్ణయించారు. పశ్చిమగోదావరి జిల్లాలో జరిగే విద్యాకానుక ప్రారంభోత్సవంలో సిఎం జగన్ పాల్గొంటారు.

సమీక్ష సందర్భంగా సిఎం వ్యాఖ్యలు:

  • నూతన విద్యావిధానం, నాడు –నేడుల కోసం మొత్తంగా సుమారు రూ.16వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం
  • నూతన విద్యా విధానంపై అందరిలోనూ అవగాహన తీసుకురావాలి
  • ఎవరికైనా సందేహాలు ఉంటే వాటిని నివృత్తి చేయాలి
  • నూతన విద్యా విధానం ఉద్దేశాలను వారికి వివరంగా తెలియజేయాలి
  • చిన్ననాటినుంచే వారికి నైపుణ్యం ఉన్న టీచర్లు అందుబాటులో ఉంటారు
  • ఇంగ్లిషు మీడియంలో బోధన అందుతుంది
  • ప్రపంచస్థాయిలో పోటీకి తగినట్టుగా విద్యార్థులు తయారు అవుతారు
  • సింగిల్‌ టీచర్‌తో నడుస్తున్న స్కూళ్లలోకూడా వర్గీకరణ ద్వారా విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా, సబ్జెక్టులను వేర్వేరు టీచర్లు బోధించే పరిస్థితులు వస్తాయి
  • దీనివల్ల ఉపాధ్యాయులపై పనిభారం కూడా తగ్గుతుంది
  • అర్హతలున్న అంగన్‌వాడీ టీచర్లకు కూడా ప్రమోషన్‌ ఛానల్‌ ఏర్పడుతుంది
  • తెలుగును తప్పనిసరి సబ్జెక్ట్ గా బోధించాలి
RELATED ARTICLES

Most Popular

న్యూస్