Monday, February 24, 2025
HomeTrending NewsYS Jagan: చిత్తూరుకు సిఎం జగన్: మెడికల్ కాలేజ్ కు శంఖుస్థాపన

YS Jagan: చిత్తూరుకు సిఎం జగన్: మెడికల్ కాలేజ్ కు శంఖుస్థాపన

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి  జూలై 4న చిత్తూరు  జిల్లాలో పర్యటించనున్నారు.  చీలాపల్లి సమీపంలో ఉన్న సీఎంసి ఆసుపత్రి ఆవరణలో మెడికల్ కళాశాల నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు. సిఎం పర్యటన  ఏర్పాట్లను  డిప్యూటీ సిఎం కే. నారాయణ స్వామి, రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,  ఎమ్మెల్సీ, సిఎం  పర్యటనల సమన్వయ కర్త తలశీల రఘురామ్, రాజంపేట ఎంపి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, , స్థానిక ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు, ఎమ్మెల్సీ  కే.అర్.జే భరత్, కలెక్టర్ శాన్ మోహన్, ఎస్పీ రిషాంత్ రెడ్డి, తదితరులు పరిశీలించారు. మెడికల్ కళాశాల ఆసుపత్రికి భూమి పూజతో పాటు  స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్  లో నిర్వహించే బహిరంగ సభలో సిఎం ప్రసంగిస్తారు.

హెలీప్యాడ్, బహిరంగ సభ, భూమి పూజ చేసే ప్రాంతాలను పరిశీలించిన నేతలు అనతరం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్