Friday, September 20, 2024
HomeTrending NewsYS Jagan: 50వేల ఇళ్ళకు నేడు శంఖుస్థాపన

YS Jagan: 50వేల ఇళ్ళకు నేడు శంఖుస్థాపన

సీఆర్డీఏ పరిధిలోని ఆర్ 5 జోన్ లో  ఇళ్ళ నిర్మాణానికి నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శంఖుస్థాపన చేయనున్నారు.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ద్వారా ఈడబ్ల్యూఎస్ లేఅవుట్లలో రూ.1,829.57 కోట్ల వ్యయంతో 50,793 ఇళ్ల నిర్మాణానికి, 45 సామాజిక మౌలిక వసతుల ప్రాజెక్టులకు గుంటూరు జిల్లా కృష్ణాయపాలెం లే అవుట్ వద్ద నేడు శ్రీకారం చుట్టనున్నారు.

పేదలకు పక్కా గృహాల కల్పనలో దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో ఉందని,  అక్కచెల్లెమ్మలకు సాధికారత కల్పించడమే లక్ష్యంగా దేశంలో ఎక్కడా లేని విధంగా 71,811 ఎకరాల్లో 30.65 లక్షల మందికి  ఉచితంగా రూ.76,625 కోట్ల మార్కెట్ విలువ కలిగిన ఇళ్ల పట్టాలు, రిజిస్ట్రేషన్లు చేశామని,  ఇందులో ఇప్పటికే రూ.57,375 కోట్ల వ్యయంతో 21.25 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టామని ప్రభుత్వం వెల్లడించింది.  రాష్ట్రవ్యాప్తంగా 17వేల జగనన్న లేఅవుట్లలో రూ. 32,909 కోట్ల వ్యయంతో నీటి సరఫరా, విద్యుత్, ఇంటర్నెట్, డ్రైనేజీ, సీవరేజీ, రోడ్లు వంటి మౌలిక వసతులను ఏర్పాటు చేసినట్లు తెలిపింది.

పేద అక్కచెల్లెమ్మలకు ఒక గూడు ఏర్పడాలని, వారి భవిష్యత్తుకు భరోసా కల్పించాలన్న కృతనిశ్చయంతో, అడ్డంకులన్నీ అధిగమించి పేదల పక్షాన నిలబడి.. సీఆర్డీఏ పరిధిలో 50,793 మంది పేద అక్కచెల్లెమ్మలకు 26 మే, 2023న ఉచితంగా ఇళ్ల పట్టాలు అందించి, నేడు ఆ స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

ఇంటి స్థలం ఉచితంగా ఇవ్వడమే కాకుండా యూనిట్ కు రూ.1.80 లక్షల చొప్పున ఇంటి నిర్మాణానికి అందిస్తూనే.. మరోవైపు పావలా వడ్డీకి రూ. 35 వేలు చొప్పున బ్యాంకు రుణం.. దీంతో పాటు ఉచితంగా ఇసుక ఇవ్వడం ద్వారా రూ.15 వేలు, సిమెంట్, స్టీల్, మెటల్ ఫ్రేమ్స్ ఇంకా ఇతర నిర్మాణ సామాగ్రిని సబ్సీడీపై అందించడంతో ఇంకో రూ. 40 వేల మేర ప్రతి లబ్ది దారుడికి మేలు చేకూరుస్తున్నట్లు పేర్కొంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్