Saturday, February 22, 2025
HomeTrending Newsనేను మీ కుటుంబ సభ్యుడిని: సిఎం జగన్

నేను మీ కుటుంబ సభ్యుడిని: సిఎం జగన్

CM on PRC: రెండు మూడు రోజుల్లో పీఆర్సీపై ప్రకటన చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ‘మంచి చేయాలనే తపనతోనే ఉన్నామని, ఎంత మంచి చేయాలో అంత మంచి చేస్తానని, నేను మీ అందరి కుటుంబ సభ్యుడిని’ అంటూ సిఎం వ్యాఖ్యానించారు. ప్రభుత్వంపై మోయలేని భారం మోపకుండా సానుకూల దృక్పథంతో ఉండాలని సూచించారు. ఉద్యోగ సంఘాల జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ తో సిఎం నేడు సమావేశమయ్యారు. తాడేపల్లి లోని సిఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, సిఎస్ డా. సమీర్ శర్మ, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ ఎస్ రావత్ తదితరులు పాల్గొన్నారు.

నేటి సమావేశంలో ఉద్యోగ సంఘాల నేతల అభిప్రాయాలను సిఎం జగన్ తెలుసుకున్నారు. వారు చెప్పిన పలు అంశాలను అయన స్వయంగా నోట్ చేసుకున్నారు. రెండ్రోజుల్లో మరోసారి  ఉద్యోగ సంఘాలతో సిఎం సమావేశమయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత పీఆర్సీపై సిఎం ప్రకటన చేయనున్నారు.

Also Read : నిర్వాసితుల దీక్షలు పట్టించుకోరా? లోకేష్

RELATED ARTICLES

Most Popular

న్యూస్