Wednesday, February 26, 2025
HomeTrending NewsCM Delhi Tour: నేడు ప్రధానితో సిఎం జగన్ భేటీ!

CM Delhi Tour: నేడు ప్రధానితో సిఎం జగన్ భేటీ!

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి   ఢిల్లీ బయల్దేరి వెళ్ళారు. సాయంత్రం  ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కానున్నారు. ప్రధానితో భేటీకి ముందు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను కూడా సిఎం కలుసుకోనున్నారు. బిజెపిలో తాజాగా జరుగుతున్న పరిణామాలు, ఏపీకి నూతన బిజెపి చీఫ్ నియామకం, వచ్చే ఎన్నికలకు బిజెపి సన్నద్ధం, కొత్త పొత్తుల కోసం యోచిస్తున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో ఈ భేటీలకు ప్రాధాన్యం ఏర్పడింది.

రేపు మధ్యాహ్నం మూడు గంటలకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో సమావేశం కానున్న జగన్ సాయంత్రం నాలుగున్నరకు ప్రధానితో భేటీ అవుతారు.

ఈ పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం యూనిఫాం సివిల్ కోడ్ బిల్లును ప్రవేశ పెట్టేందుకు సమాయాత్తం అవుతున్న సందర్భంలో వైఎస్సార్సీపీ మద్దతు కోసం జగన్ ను కేంద్ర ప్రభుత్వ పెద్దలే ఢిల్లీ పిలిపించారని సమాచారం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్