Friday, March 20, 2026
HomeTrending Newsనేడు ఢిల్లీకి సిఎం జగన్: రేపు ప్రధానితో భేటీ

నేడు ఢిల్లీకి సిఎం జగన్: రేపు ప్రధానితో భేటీ

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ సాయంత్రం  ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో జగన్ భేటీ కానున్నారు.  రేపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్ కర్ లను కూడా సిఎం కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ సాయంత్రం 7 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి  బయల్దేరి రాత్రి 9.15 గంటలకు ఢిల్లీ చేరుకుని రాత్రికి 1 జన్‌పథ్‌ నివాసంలో బస చేస్తారు.  రేపు ఉదయం 10.15 ప్రాంతంలో ప్రధానితో భేటీ కానున్నారు.

కాగా, నేడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటనలో భాగంగా రామోజీ ఫిలిం సిటీలో చంద్రబాబుతో సమావేశం కానున్నరనే వార్తల నేపథ్యంలో సిఎం జగన్ హఠాత్తుగా ఢిల్లీ పర్యటించడం వెనుక రాజకీయ కారణాలు ఉండొచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular