Sunday, January 19, 2025
HomeTrending Newsనేడు శారదా పీఠానికి సిఎం జగన్

నేడు శారదా పీఠానికి సిఎం జగన్

CM- Sarada Peetham: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు విశాఖలో పర్యటించ నున్నారు. చినముషిడివాడలోని శ్రీశారదా పీఠం వార్షికోత్సవాలలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు.  ఉదయం 10.15 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరనున్న సీఎం 11 గంటలకు విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌ కు చేరుకుని 11.30 గంటలకు శ్రీ శారదా పీఠం చేరుకుంటారు. అక్కడ జరిగే వార్షికోత్సవాలలో పాల్గొని మధ్యాహ్నం 1.25 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్ట్‌ నుంచి తిరుగుపయనమవుతారు.

శ్రీ స్వ‌రూపానందేంద్ర మ‌హాస్వామివారి, ఉత్తరాదికారి శ్రీ స్వాత్మానందేంద్ర స‌ర‌స్వ‌తి స్వామివారి ఆధ్వర్యంలో శ్రీ శారదాపీఠం వార్షిక మహోత్సవాలు ఫిబ్రవరి 7న అత్యంత వైభవోపేతంగా మొదలయ్యాయి. 11న జరిగే రాజశ్యామల యాగం, మహా పూర్ణాహుతితో ఉత్సవాలు ముగుస్తాయి. నిన్న 8వ తేదీన రథ సప్తమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. నేడు (9వ తేదీ) మహా విద్యా పారాయణం, వన దుర్గా హోమం జరగనున్నాయి.

Also Read : రామానుజ స్ఫూర్తి కొనసాగించాలి: సిఎం

RELATED ARTICLES

Most Popular

న్యూస్