Sunday, January 19, 2025
HomeTrending Newsదిశ యాప్‌ వినియోగంపై అవగాహన

దిశ యాప్‌ వినియోగంపై అవగాహన

మహిళల భద్రత, రక్షణకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ‘దిశ’ పేరిట ఓ ప్రత్యక చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ చట్టం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఈ చట్టం ఆమోదం పొందే లోపు మహిళలకు భరోసా కల్పించేందుకు దిశ పోలీస్ స్టేషన్లు, దిశయాప్‌ లను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆపద సమయంలో ఈ యాప్ బటన్ నొక్కితే వెంటనే సమీప పోలీస్ స్టేషన్ ను సమాచారం వెళుతుంది. ఆ ఫోన్ సిగ్నల్ ఆధారంగా పది నిమిషాల్లో పోలీసులు ఆ ప్రదేశానికి చేరుకునేలా పటిష్టమైన వ్యవస్థను రూపొందించారు.

దిశ యాప్ మొబైల్ లో డౌన్ లోడ్ చేసుకుని వినియోగించే విధానంపై అవగాహన, చైతన్యం కలిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది. మహిళా భద్రతపై ఇటీవల జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా ఈ డ్రైవ్‌ నిర్వహిస్తున్నారు. దిశయాప్‌ను ఇప్పటికే 16 లక్షల మంది డౌన్‌లోడ్‌చేసుకున్నారు. ప్రతి మహిళా, యువతి, విద్యార్థిని డౌన్‌లోడ్‌ చేసుకునేలా ఇంటింటికీ ప్రచారాన్ని ప్రభుత్వం చేపట్టింది. దీనిలో భాగంగా జూన్ 29 మంగళవారం ఉదయం 10:30 గంటల ప్రాంతంలో విజయవాడలోని గొల్లపూడిలో జరిగే ఈ అవగాననా కార్యక్రమంలో సిఎం జగన్ స్వయంగా పాల్గొంటున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 18 దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసిన ప్రభుత్వం ప్రతి జిల్లాలో మహిళలపై అఘాయిత్యాలకు సంబంధించిన కేసుల విచారణకు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ లను నియమించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్