Sunday, January 19, 2025
HomeTrending Newsఏప్రిల్11న కేబినెట్ ప్రక్షాళన?

ఏప్రిల్11న కేబినెట్ ప్రక్షాళన?

Cabinet Reshuffle: ఆంధ్ర ప్రదేశ్ మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణకు ముహూర్తం ఖరారైందని తెలుస్తోంది. ఏప్రిల్ 11న జగన్ తన మంత్రివర్గంలో మార్పులు చేయనున్నారు.  దీనికి సంబంధించిన కసరత్తు పూర్తి చేస్తున్నారు.

సిఎం జగన్ ను మినహాయిస్తే కేబినేట్ లో మొత్తం 25 మంది మంత్రులు ఉండేవారు. మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మరణంతో ఈ సంఖ్య 24కు తగ్గింది. మొత్తం మంత్రులలో కేవలం ముగ్గురికే కొనసాగింపు ఉంటుందని వైసీపీ వర్గాల ద్వారా తెలిసింది.  ప్రస్తుత మంత్రివర్గంలో పదిమందికి పార్టీ బాధ్యతల్లో భాగంగా రీజినల్ కోఆర్డినేటర్ పదవులు అప్పగిస్తారని,  మిగిలిన వారికి జిల్లా పార్టీ బాధ్యతలు  ఇస్తారని తెలుస్తోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్