Thursday, March 19, 2026
HomeTrending Newsనేడు చీమకుర్తికి సిఎం జగన్

నేడు చీమకుర్తికి సిఎం జగన్

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు బుధవారం ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి కాంస్య విగ్రహాలను ఆవిష్కరించి అనతరం జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.

ఉదయం 9.45 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి  10.35 గంటలకు చీమకుర్తి చేరుకోనున్నారు, 10.55 గంటలకు చీమకుర్తి మెయిన్‌రోడ్డులోని బూచేపల్లి సుబ్బారెడ్డి కళ్యాణమండపం వద్ద దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డిల కాంస్య విగ్రహాలను ఆవిష్కరిస్తారు. అనంతరం బీవీఎస్‌ఆర్‌ ఇంజినీరింగ్‌ కాలేజ్‌ వద్ద ఏర్పాటుచేసిన బహిరంగసభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.40 గంటలకు అక్కడి నుంచి తిరుగు పయనమై 1.30 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

సిఎం పర్యటన ఏర్పాట్లను మాజీ మంత్రి  బాలినేని శ్రీనివాసరెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఏ.ఎస్. దినేష్ కుమార్,  ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ తదితరులు పరిశీలించారు,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular