Friday, October 18, 2024
HomeTrending Newsసామాజిక న్యాయానికి ప్రతిరూపంగా అంబేద్కర్ విగ్రహం: సిఎం జగన్

సామాజిక న్యాయానికి ప్రతిరూపంగా అంబేద్కర్ విగ్రహం: సిఎం జగన్

విజయవాడలోని స్వరాజ్ మైదానంలో ఏర్పాటు చేస్తోన్న భారత రాజ్యంగ నిర్మాత డా. బిఆర్. అంబేద్కర్‌ విగ్రహాన్ని జనవరి 19 ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు.  సామాజిక న్యాయానికి ప్రతిరూపంగా నిలవబోతోన్న ఈ విగ్రహాన్ని 19 ఎకరాల్లో రూ.404 కోట్లతో 125 అడుగులతో ఆవిష్కరిస్తున్నామని తెలిపారు. గ్రామ సచివాలయంనుంచి రాష్ట్ర స్థాయివరకూ సామాజిక న్యాయ నినాదం వినిపించాలని,  ప్రతి సచివాలయం నుంచి 5 మందిని ఈ  ప్రారంభోత్సవానికి ఆహ్వానించాలని సూచించారు.  ప్రతి మండల కేంద్రం నుంచి ప్రత్యేకమైన బస్సులు నడుపుతామని, గ్రామ స్థాయిలో పాలనా వ్యవస్థలో సమూల మార్పులు చేసి గ్రామ స్వరాజ్యం తీసుకు వచ్చామని… ఈ మార్పునకు ప్రతిరూపంగా అంబేద్కర్‌ విగ్రహం నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన సిఎం  జగన్‌… వైయస్సార్‌ పెన్షన్‌ కానుక, వైయస్సార్‌ ఆసరా, వైయస్సార్‌ చేయూత, అంబేద్కర్‌ విగ్రహం ప్రారంభోత్సవం తదితర కార్యక్రమాలపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు.

అధికారులకు సిఎం చేసిన సూచనలు:

* జనవరిలో 3, ఫిబ్రవరిలో 1, మొత్తంగా నాలుగు ప్రధానమైన కార్యక్రమాలు చేస్తున్నాం
* జనవరి1 నుంచి వైయస్సార్‌ పెన్షన్‌ కానుక రూ.3వేలకు పెంపు
* జనవరి 1 నుంచి 8వ తారీఖు వరకూ పెన్షన్ల పెంపు కార్యక్రమం ఉంటుంది
* నెలకు 400 కోట్ల మాత్రమే గత ప్రభుత్వంలో సగటున పెన్షన్లకోసం ఖర్చు చేసేవారు
* ఇప్పుడు నెలకు రూ.1950 కోట్ల ఖర్చు చేస్తున్నాం
* మన రాకముందు పెన్షన్ల సంఖ్య 39 లక్షలు, ఇప్పుడు 66 లక్షలు
* రెండో కార్యక్రమం జనవరి 19న అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నాం
* జనవరి 23 నుంచి 31 ఆసరా కార్యక్రమం జరుగుతుంది
* నాలుగో కార్యక్రమం వైయస్సార్‌ చేయూత కార్యక్రమం ఫిబ్రవరి 5 నుంచి 14వరకూ కొనసాగుతుంది
* ప్రభుత్వం చాలా ప్రతిష్ట్మాత్మకంగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తుంది
* అర్హత ఉండీ ఎవరైనా ఎక్కడైనా మిగిలిపోయిన సందర్భాల్లో వారికి పథకాలు వర్తింపు చేసే బై యాన్యువల్‌ కార్యక్రమం జనవరి 5న జరుగుతుంది
* ఈ కార్యక్రమం జరిగే లోపే దాదాపు 1.7 లక్షల పెన్షన్లు ఒకటో తారీఖు నుంచే ఇస్తారు
* 66,34,742మందికి రూ.1968 కోట్లకుపైగా పెన్షన్ల రూపంలో అందుతాయి
* మన ప్రభుత్వం రాకముందు పొదుపు సంఘాలు పూర్తిగా కుదేలైపోయాయి
* మనం వారికి చేయూత నిచ్చి ఆసరా, సున్నావడ్డీ, చేయూత, అమ్మ ఒడి పథకాల ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టగలిగాం
* మహిళల ఆర్థిక స్వావలంబన, సాధికారితను సాధించగలిగాం
* క్రమం తప్పకుండా ప్రతి ఏటా లబ్ధిదారులకు అందించగలిగాం
* అందుకనే ఈరోజు పొదుపు సంఘాల్లో ఎన్‌పీఏలు 0.౩శాతానికి చేరాయి
* అక్క చెల్లెమ్మలకు ఇంతగా తోడు ఉంటే ప్రభుత్వం మనది
* ఆసరాకోసమే రూ.25,570 కోట్లు ఖర్చు చేశాం
* మూడు విడతలుగా ఇప్పటికే రూ.19,,195 కోట్లు ఇచ్చాం
* చివరి విడతగా 6,394 కోట్లు ఇస్తున్నాం
* జనవరి 23 నుంచి 31వ తారీఖు వరకూ కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది
* ఈ కార్యక్రమం ద్వారా 78.94 లక్షల మంది మహిళలు లబ్ధి పొందారు
* ఫిబ్రవరి 15-16 తేదీల్లోనే ఉత్తమ సేవలు అందించినందుకు వాలంటీర్లకు సేవామిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డులు
* ఫిబ్రవరి 5 నుంచి 14వరకూ వైయస్సార్‌ చేయూత కార్యక్రమం
* ఇప్పటివరకూ రూ.14,129 కోట్లు ఇచ్చాం
* ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్లో 45 ఏళ్ల పైబడ్డ ఉన్న మహిళలకు ఏడాదికి రూ.18,750లు ఇచ్చాం
* యూనిక్‌ లబ్ధిదారులు 31,23,466 మంది ఉన్నారు
* ఈ పథకం వారి జీవితాల్లో ఏరకంగా మార్పులు తీసుకు వచ్చిందో తెలియజెప్పాలి
* చివరి విడతద్వారా 26,39,703 మంది లబ్ధి పొందుతున్నారు
* మహిళల జీవనోపాథి మార్గాలపై వారిలో మరింత అవగాహన కల్పించి, అవకాశాలనుకూడా వివరించాలి

RELATED ARTICLES

Most Popular

న్యూస్