Sunday, September 22, 2024
HomeTrending NewsCM Jagan: వరద సాయంపై సిఎం క్షేత్ర స్థాయి సమీక్ష

CM Jagan: వరద సాయంపై సిఎం క్షేత్ర స్థాయి సమీక్ష

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల్లో నేటి నుంచి రెండ్రోజుల పాటు పర్యటించనున్నారు.  అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు జిల్లా, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లాల్లో పర్యటించి బాధిత గ్రామాల ప్రజలతో నేరుగా మాట్లాడి వారికి అందిన సహాయ పునరావాస కార్యక్రమాలపై ఆరా తీయనున్నారు.

ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఏఎస్‌ఆర్‌ జిల్లా కూనవరం మండలం కోతులగుట్ట చేరుకుంటారు. అక్కడ గోదావరి వరదల ప్రభావిత ప్రాంతాలు, సహాయక చర్యలపై అధికారులతో మాట్లాడిన అనంతరం కూనవరం బస్‌స్టాండ్‌ సెంటర్‌లో కూనవరం, వీఆర్‌ పురం మండలాల వరద బాధితులతో సమావేశం అవుతారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి కుక్కునూరు మండలం గొమ్ముగూడెం చేరుకుంటారు. అక్కడ వరద నష్టంపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ పరిశీలన అనంతరం వరద బాధిత కుటుంబాలతో సమావేశమవుతారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి రాజమహేంద్రవరం చేరుకుంటారు. అక్కడ ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమావేశం తర్వాత రాత్రికి అక్కడే బస చేస్తారు.

ఉదయం 9.10 గంటలకు రాజమహేంద్రవరం ఆర్ట్స్‌ కాలేజ్‌ గ్రౌండ్‌ నుంచి బయలుదేరి డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం గురజాపులంక చేరుకుంటారు. అక్కడ వరద బాధితులతో సమావేశం తర్వాత తానేలంక రామాలయంపేట గ్రామం చేరుకుంటారు. అక్కడ వరద బాధితులతో సమావేశం తర్వాత అయినవిల్లి మండలం తోటరాముడివారిపేట, కొండుకుదురు చేరుకుంటారు. అక్కడ వరద బాధితులతో సమావేశం తర్వాత అక్కడి నుంచి బయలుదేరి అదే రోజు మధ్యాహ్నం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్