Sunday, September 8, 2024
HomeTrending Newsయూనివర్సిటీల్లో పోస్టుల భర్తీ: సిఎం ఆదేశం

యూనివర్సిటీల్లో పోస్టుల భర్తీ: సిఎం ఆదేశం

విశ్వవిద్యాలయాల్లో టీచింగ్‌ స్టాప్‌ను పూర్తిగా భర్తీ చేసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టుల భర్తీకి ఇప్పటికే ఆమోదం తెలిపామని, టీచింగ్‌ స్టాఫ్‌ లేనప్పుడు యూనివర్సిటీలు ఉన్నా లాభం ఉండదని సిఎం అభిప్రాయపడ్డారు. మంచి అర్హతా ప్రమాణాలు కలిగిన వారిని నియమించాలని సూచించారు. లేకపోతే రిక్రూట్‌ చేసినా అర్ధం ఉండదని నిర్దేశించారు. ఉన్నత విద్యపై తాడేపల్లి లోని క్యాంప్‌ కార్యాలయంలో సిఎం జగన్ సమీక్ష జరిపారు.  రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల వైస్‌ ఛాన్సలర్లు, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సిఎం వెల్లడించిన అభిప్రాయాలు:

⦿ యూనివర్సిటీల నియామకాల్లో అత్యుత్తమ ప్రమాణాలు పాటించాలి
⦿ అత్యంత పారదర్శకంగా నియామకాలు చేపట్టాలి
⦿ రిక్రూట్‌మెంట్‌లో పక్షపాతానికి తావుండకూడదు
⦿ కరిక్యులమ్‌లో కూడా మార్పులు రావాలి. అప్పుడే నాణ్యమైన విద్య అందించగలుగుతాం
⦿ విద్యా ప్రమాణాలు కూడా మెరుగుపడతాయి
⦿ పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువు, అదీ నాణ్యతతో కూడిన విద్య మాత్రమే
⦿ మనం వచ్చిన తర్వాత విద్యారంగంలో తేడా ఏంటి అన్నది కనిపించాలి
⦿ ఈ ప్రభుత్వం చదువుకు ఇచ్చిన ప్రాధాన్యత మరే ప్రభుత్వమూ ఇవ్వలేదు
⦿ నాణ్యమైన విద్య అందించడానికి అనేక చర్యలు తీసుకున్నాం
⦿ మంచి చదువులతో కుటుంబాల తలరాతలు మారుతాయి
⦿ యూనివర్సిటీల్లో ఇంటర్నెట్‌ సదుపాయం పూర్తిస్ధాయిలో ఉండేలా చూసుకోవాలి
⦿ మంచి బ్యాండ్‌ విడ్త్‌ క్వాలిటీ ఉండేలా చూసుకోవాలి
⦿ కాలేజీలు సరిగ్గా లేకపోతే యూనివర్సిటీల ప్రతిష్ట దెబ్బతింటుంది
⦿ ఏ కాలేజీలోనైనా ప్రమాణాలు లేకపోతే గుర్తించిన అంశాలను వారి దృష్టికి తీసుకెళ్లి మెరుగుపరుచుకోవడానికి సమయం ఇవ్వండి ప్రమాణాలు లేనివాటికి అనుమతులు ఇవ్వొద్దు
⦿ ఈ ప్రభుత్వం వచ్చాక ఉన్నత విద్యలో అనేక మార్పులు తీసుకొచ్చాం
⦿ జాబ్‌ ఓరియెంటెడ్‌గా మన కోర్సులను తీర్చిదిద్దాలి
⦿ విద్యార్ధి విశ్వవిద్యాలయం నుంచి బయటకు వచ్చేటప్పుడు కచ్చితంగా ఉద్యోగం సాధించేలా ఉండాలి
⦿ మంచి చదువులున్నా ఇంటర్వూల దగ్గరకు వచ్చేసరికి విఫలం అవుతున్న పరిస్థితులు చూస్తున్నాం
⦿ అప్రెంటిస్‌షిప్‌ కచ్చితంగా ఉండాలి
⦿ ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని తీసుకువస్తున్నాం
⦿ జిల్లా కలెక్టర్‌తో సమన్వయం చేసుకుని నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను, కాలేజీలను అనుసంధానం చేయాల
యూనివర్సిటీలు – మూడేళ్ల కార్యాచరణ
⦿ ప్రతివారం ఒక వీసీతో ఉన్నత విద్యా మండలి సమావేశం కావాలి
⦿ యూనివర్సిటీల్లో సమస్యలు, ప్రభుత్వ పరంగా అందించాల్సిన తోడ్పాటుపై కలిసి కూర్చుని చర్చించాలి
⦿ ఆ సమావేశంలో గుర్తించిన అంశాలను నా దృష్టికి తీసుకురావాలి
⦿ ఇలా రాష్ట్రంలో ప్రతి యూనివర్సిటీ వీసీతో కలసి విడివిడిగా సమావేశాలు నిర్వహించాలి
⦿ ప్రస్తుతం ఉన్న స్ధాయి, మెరుగుపర్చుకోవాల్సిన ప్రమాణాలను గుర్తించాలి
⦿ తర్వాత యూనివర్సిటీల వారీగా లక్ష్యాలను నిర్దేశించుకోవాలి
⦿ వచ్చే మూడేళ్ల కాలానికి కార్యాచరణ రూపొందించాలి

సమీక్ష సమావేశంలో భాగంగా ఇంగ్లీష్ కమ్యూనికేషన్‌ వర్క్‌ బుక్, టెక్ట్స్‌ బుక్స్‌ తో పాటు, ఏపీఎస్‌సీహెచ్‌ఈ పాడ్‌ కాస్ట్‌ ను సీఎం వైయస్‌.జగన్‌ ఆవిష్కరించారు. ఈ సమీక్షా సమావేశానికి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఉన్నత విద్యాశాఖ స్పెషల్‌ సీఎస్‌ సతీష్‌ చంద్ర, ఏపీఎస్‌సీహెచ్‌ఈ ఛైర్మన్‌ కె హేమచంద్రారెడ్డి, కాలేజీ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ పోలా భాస్కర్, వివిధ విశ్వవిద్యాలయాల వైస్‌ ఛాన్సలర్లు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్