Saturday, September 21, 2024
HomeTrending Newsటెలికాం సేవలతో పథకాల అమలు సులభం: సిఎం

టెలికాం సేవలతో పథకాల అమలు సులభం: సిఎం

మారుమూల గిరిజన ప్రాంతాలకు సమర్థవంతమైన టెలికాం సేవలు అందించడం ద్వారా సమాచార సంబంధాలు బాగా మెరుగుపడతాయని, ప్రభుత్వ పథకాల అమలు మరింత సులభతరం అవుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.  అత్యంత మారుమూల ప్రాంతాలు నెట్‌వర్క్‌ పరిధిలోకి వస్తాయని,  వేగంగా, పారదర్శకంగా పనులు ముందుకు సాగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.  మారుమూల గిరిజన ప్రాంతాల్లో  ఏర్పాటు చేసిన 300 4జి సెల్‌టవర్స్‌ను క్యాంపు కార్యాలయం నుంచి  జగన్‌ వర్చువల్‌గా  ప్రారంభించారు. ఎయిర్‌టెల్‌ ఆధ్వర్యంలో 136 , జియో ఆధ్వర్యంలో 164 టవర్లు ఏర్పాటు కాగా  అల్లూరి సీతారామరాజు జిల్లాలో 246; పార్వతీపురం మన్యం జిల్లాలో 44;
ప్రకాశంలో 4; ఏలూరులో 3; శ్రీకాకుళంలో 2; కాకినాడలో 1 టవర్‌ నెలకొల్పారు.  వీటి ద్వారా 944 ఆవాసాలకు, 2 లక్షల మంది ప్రజలకు ప్రయోజనం కలగనుంది.  గత జూన్ మాసంలో 100 ఏర్పాటు చేయగా,  మొత్తంగా ఇప్పటివరకూ 400 టవర్లను నెలకొల్పారు.

ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ…

* గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్‌ క్లినిక్స్‌, ఇంగ్లిషు మీడియం స్కూల్స్‌ గ్రామ రూపురేఖలను మారుస్తాయి
* ఈ ప్రాంతాల్లో టెలికాం సేవలు కారణంగా ఇవి మరింత బలోపేతంగా నడుస్తాయి:
* ఇవాళ 300 టవర్లు, జూన్‌లో 100 టవర్లు ఏర్పాటు చేశారు. దాదాపు 400 కోట్లు ఖర్చు చేశారు
* 400 టవర్ల ఏర్పాటు ద్వారా 2.42 లక్షల మందికి ఉపయోగకరం
* ఇవాళ ఏర్పాటు చేసిన టవర్ల ద్వారా 2 లక్షల మందికి ఉపయోగం
* మొత్తంగా కలిపి 2887 టవర్లను ఏర్పాటు చేస్తున్నారు
* మొత్తంగా 3,119 కోట్లు ఖర్చు చేస్తున్నాం
* టవర్లకు అవసరమైన భూములను వెంటనే అప్పగించడం జరిగింది
* 5,549 గ్రామాలకు పూర్తి మొబైల్‌ టెలికాం సేవలు అందుతాయి

ఐటీ, పరిశ్రమలు, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, సీఎస్‌ డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌ రెడ్డి, ఐటీశాఖ కార్యదర్శి కోన శశిధర్, కమ్యూనికేషన్స్‌ (ఐటీశాఖ) డైరెక్టర్‌ సి చంద్రశేఖర్‌ రెడ్డి, భారతీ ఎయిర్‌టెల్, రిలయెన్స్‌ సంస్ధల ప్రతినిధులు హాజరు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్