Wednesday, January 22, 2025
HomeTrending NewsPolavaram: గైడ్ వాల్ సమస్యను విపత్తు చేశారు: సిఎం జగన్

Polavaram: గైడ్ వాల్ సమస్యను విపత్తు చేశారు: సిఎం జగన్

పోలవరం ప్రాజెక్టు గైడ్‌వాల్‌లో వచ్చిన చిన్న సమస్యను విపత్తు మాదిరిగా చూపించే దౌర్భాగ్యమైన మీడియా మన రాష్ట్రంలో ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇలాంటి ప్రాజెక్టు నిర్మాణాల్లో సహజంగానే చిన్న చిన్న సమస్యలు వస్తాయని,  వాటిని గమనించుకుంటూ… ఎప్పటికప్పుడు మరమ్మతులు చేసుకుంటూ ముందుకు సాగుతారని అన్నారు.  పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను సిఎం సమగ్రంగా పరిశీలించారు.  ఎగువ కాఫర్‌ డ్యాం, దిగువ కాఫర్‌ డ్యాం, దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌ వద్ద జరుగుతున్న పనులను క్షేత్ర స్థాయిలో అడిగి తెలుసుకున్నారు.గత సీజన్లో అనూహ్యంగా వచ్చిన వరద విపత్తును తట్టుకునేందుకు ఎగువ కాఫర్‌ డ్యాం ఎత్తు పెంపును కూడా పరిశీలించారు. తర్వాత ప్రాజెక్టు వద్ద అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన సిఎం డయాఫ్రం వాల్‌ ప్రాంతంలో పునర్‌ నిర్మాణాలు, ఆతర్వాత ఈసీఆర్‌ఎఫ్‌ డ్యాం నిర్మాణలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

పోలవరం ప్రాజెక్టులో తొలిదశను పూర్తిచేయడానికి – రూ. 12,911.15 కోట్లు ఇచ్చేందుకు ఆమోదం తెలుపుతూ కేంద్ర ఆర్థికశాఖ మెమోరాండం జారీచేసిందని, దీన్ని కేంద్ర జలశాఖకు లేఖద్వారా తెలిపిందని, గత ప్రభుత్వం ప్రణాళిక లోపం వల్ల దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌ ప్రాంతంలో నిర్మాణాలకోసం అదనంగా రూ. 2 వేల కోట్లు ఇచ్చిందని అధికారులు తెలిపారు. కాంపౌండ్‌వారీ బిల్లుల చెల్లింపు వల్ల ప్రాజెక్టు నిర్మాణాలు ఆలస్యం అవుతున్న విషయాన్నిపరిగణలోకి తీసుకుని దానికి కేంద్ర మినహాయింపులు కూడా ఇచ్చిందని వివరించారు.

ఈ సందర్భంగా సిఎం జగన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు….

  • గత ప్రభుత్వం హయాంలో ఎగువ కాఫర్‌ డ్యాంలో ఖాళీలు వదిలేశారు, వీటి గుండా వరదనీరు అతి వేగంతో ప్రవహించడం వల్ల ప్రాజెక్టు నిర్మాణాలకు తీవ్ర నష్టం వాటిల్లింది
  • ఈఎస్‌ఆర్‌ఎఫ్‌ డ్యాం నిర్మాణానికి కీలకమైన డయాఫ్రంవాల్‌ దారుణంగా దెబ్బతింది
  • దీనివల్ల ప్రాజెక్టు ఆలస్యంకావడమే కాదు, రూ.2వేల కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సి వచ్చింది
  •  ఇది మాత్రం ఎల్లోమీడియాకు కనిపించలేదు, ఎందుకంటే.. రామోజీరావు బంధువులకే నామినేషన్‌ పద్ధతిలో పనులు అప్పగించేశారు
  • ప్రాజెక్టు స్ట్రక్చర్‌తో ఏమాత్రం సంబంధం లేనిది గైడ్‌వాల్‌ సమస్యను పెద్ద విపత్తులాగ చూపించే ప్రయత్నంచేస్తున్నారు
  • అయినా దీన్నికూడా పాజిటివ్‌గా తీసుకుని తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకోవాలి
  • దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌ను త్వరగా పూర్తిచేయాలి, ఇది పూర్తైతే మెయిన్‌ డ్యాం పనులు చురుగ్గా కొనసాగడానికి అవకాశం ఉంటుంది
  • డిసెంబర్‌ కల్లా పనులు పూర్తిచేయడానికి కార్యాచరణతో ముందుకు వెళ్తున్నామన్న అధికారులు.

నిర్వాసిత కుటుంబాలకు పునరాసంపైనా సీఎం సమీక్ష.

  • పునరావాసం కాలనీల్లో అన్ని మౌలిక సదుపాయాలూ ఏర్పాటు చేయాలి
  •  కాలనీలు ఓవైపు పూర్తవుతున్న కొద్దీ, సమాంతరంగా వీటిపై దృష్టి పెట్టాలి
  • నిర్వాసిత కుటుంబాల్లో 12, 658 కుటుంబాలను ఇప్పటికే  తరలించామని అధికారులు చెప్పగా…  షెడ్యూలు ప్రకారం ఈ ప్రక్రియ పూర్తయ్యేలా చూడాలని సూచన
  • పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని అద్భుతమైన టూరిజ్టు ప్రాంతంగా తీర్చిదిద్దాలి, మంచి బ్రిడ్జిని నిర్మించాలి
  • పర్యాటకులు ఉండేందుకు మంచి సదుపాయాలతో హోటల్‌ ఏర్పాటుకూడా చర్యలు తీసుకోవాలి

కీలక పనుల్లో గణనీయ ప్రగతి: పురోగతిపై అధికారుల వివరణ

  • 48 రేడియల్‌ గేట్లు పూర్తిస్థాయిలో పెట్టారని…  స్పిల్‌వే కాంక్రీట్,రివర్‌ స్లూయిస్‌ గేట్లు, ఎగువ కాఫర్‌ డ్యాం, దిగువ కాఫర్ డ్యాం,  గ్యాప్‌-3 వద్ద కాంక్రీట్‌ డ్యాం, పవర్‌హౌస్‌లో సొరంగాల తవ్వకం పూర్తయ్యిండి
  • అప్రోచ్‌ ఛానల్‌ పనులు దాదాపుగా పూర్తికావొచ్చాయి, ఈసీఆర్‌ఎఫ్‌ డ్యాంలో దెబ్బతిన్న గ్యాప్‌-1 ప్రాంతంలో ఇసుక నింపే కార్యక్రమం పూర్తయ్యింది. ఆప్రాంతంలో వైబ్రో కాంపాక్షన్‌కూడా పూర్తయ్యింది.
  • ఈసీఆర్‌ఫ్‌ గ్యాప్‌-2 ప్రాంతంలో నింపడానికి అవసరమైన 100శాతం ఇసుక రవాణా పూర్తయ్యింది.వ్ ఇక వాటిని నింపే పనులు చురుగ్గా ముందుకు సాగుతున్నాయి.
RELATED ARTICLES

Most Popular

న్యూస్